Gratuity: ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త.. గ్రాట్యూటీ బెనిఫిట్స్ పెంపు.. ఎంత పెరగనుందంటే?

www.mannamweb.com


Gratuity: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి , 2024లో డియర్‌నెల్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) 4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసింది. అయితే, డీఏ 50 శాతానికి పెంచిన క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీకి సంబంధించిన వివిధ అలవెన్సులు సైతం పెరగనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) పెంచుతూ ఇటీవలే ప్రకటన చేసింది కేంద్రం. అలాగే గ్రాట్యూటీలపై పన్ను మినహాంపు లిమిట్ రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తాజాగా మరో శుభవార్త అందించింది కేంద్రం. రిటైర్మెంట్ గ్రాట్యూటీ, మరణానంతర గ్రాట్యూటీ (పారితోషికం) సైతం పెంచనుంది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 30, 2024 రోజున ఆఫీస్ ఆర్డర్ జారీ చేసింది. దీని ప్రకారం.. ‘ సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పెన్షనర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 2016, ఆగస్టులో ఓఎం నంబర్ 38/3712016 P& PW (a) (1)లోని ప్యారా 6.2 ప్రకారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. రిటైర్మెంట్ గ్రాట్యూటీ, డెత్ గ్రాట్యూటీ అనేది డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరినప్పుడు బేసిక్ పే లో 25 శాతం పెరగనున్నాయి. 25 శాతం పెంపు నేపథ్యంలో ఈ రిటైర్మెంట్ గ్రాట్యూటీ, డెత్ గ్రాట్యూటీ బెనిఫిట్ గరిష్ఠ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెరగనుంది.’ అని పేర్కొంది.