Grey Hair : జుట్టు ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది. జుట్టు పెంచడంలో నెయ్యి కీ రోల్ పోషిస్తుంది. అదెలానో తెలుసుకోండి.
నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఆయుర్వేద గుణాలు ఎన్నో ఉన్న నెయ్యిని ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మం, జుట్టుని కాపాడేందుకు కూడా మంచిది. నెయ్యిని తినడమే కాదు.. దీనిని స్కిన్, హెయిర్‌కి అప్లై చేస్తే చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.
తెల్లబడడం..
జుట్టుకి నెయ్యిని అప్లై చేస్తే తెల్లబడదు. అయితే, అందులో కొద్దిగా ఆముదం, మరే ఏదైనా నూనె కలిపి రాస్తే ఇది తలలోకి చొచ్చుకుపోయి జుట్టు నల్లబడుతుంది. నెయ్యి, ఆముదాన్ని రాస్తే జుట్టు నల్లగా మారుతుంది. కొద్దిగా నెయ్యిని రాయడం మంచిదని గుర్తుపెట్టుకోండి.
పొడిబారిన జుట్టుకి రెమిడీ..
పొడి జుట్టుకి నెయ్యి చాలా మంచిది. ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టు డ్రైనెస్, పొడి జుట్టు సమస్యని దూరం చేసి జుట్టుని కండీషనింగ్ చేస్తుంది. అయితే, షాంపూ చేశాక నెయ్యిని అప్లై చేస్తే ఇందులోని హెల్దీ ఫ్యాట్స్ జుట్టు మూలాలని బలంగా చేస్తాయి. జుట్టుకి సహజ తేమని అందిస్తాయి.
జుట్టు మెరుపుకి..
జుట్టు చిట్లడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. దీనికి నెయ్యి చెక్ పెడుతుంది. ఇందులో విటమిన్ ఎ, డి, కె2, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీని కోసం నెయ్యిని కొద్దిగా వేడి చేసి జుట్టు చివర్లకి అప్లై చేయాలి. ఓ గంట తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. జుట్టుకి సహజమైన షైన్, మృదుత్వాన్ని పెంచుతుంది.
చుండ్రు..
చుండ్రుని దూరం చేయడానికి నెయ్యి మంచిది. పొడి చర్మం ఉన్నవారు తెల్ల జుట్టు సమస్యని దూరం చేయడానికి నెయ్యి హెల్ప్ చేస్తుంది. ఇందులోని విటమిన్స్, ఖనిజాలు చుండ్రుని నయం చేయడానికి చాలా మంచివి. రెండు టీస్పూన్ల నెయ్యిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకి అప్లై చేయాలి. అరగంట తర్వాత క్లీన్ చేయాలి.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.