ఏపీలో ఆ రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్: అప్పుల నుంచి బయటపడేందుకు రూ.లక్ష వరకు రుణాలు…అర్హతలు, పూర్తి వివరాలు ఇవే

కౌలు రైతులు ఎన్నో వ్యయప్రయాసలు పడి వ్యవసాయం చేస్తుంటారు. పంట పండించేందుకు ఎన్నో అప్పులు చేస్తారు. అప్పులు చేసి పండించినప్పటికీ ఎప్పుడు ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చి ఎలాంటి నష్టం చేకూరుస్తాయో తెలియని పరిస్థితి.


ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే ఇక ఆ రైతు పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారవుతుంది. ఒకవైపు పంటనష్టపోయి మరోవైపు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు పీఏసీఎస్‌ల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నిర్ణయించుకుంది. లక్ష రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా రైతులు పెట్టుబడి భరోసా పొంది అప్పుల ఊబి నుండి బయటపడే అవకాశం ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది.

కౌలు రైతులకు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పంటలు సాగు చేసే కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందులను ఉపశమనం కలిగించాలని భావిస్తోంది.పంటలు పండించే సమయంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవాలని నిర్ణయించింది.కౌలు రైతులను మరింత ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా అర్హులైన కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చేందుకు అధికారికంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది.

తక్కువ వడ్డీకి పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు

ఇకపోతే కౌలు రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం వల్ల వారు ప్రైవేటు అప్పుల భారం నుంచి విముక్తి పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ వివరాల సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ జాబితా ఆధారంగా రుణాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చుల వంటి ముఖ్యమైన వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి అని ప్రభుత్వం భావిస్తోంది.

రుణం పొందేందుకు అర్హతలు ఇవే

రూ.లక్ష వరకు పీఏసీఎస్ నుంచి రుణం పొందడానికి కౌలు రైతులకు పలు షరతులు విధించింది ప్రభుత్వం.లబ్ధిదారులు సంబంధిత అధికారుల నుంచి జారీ చేయబడిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. అంతేకాదు కౌలు రైతులు సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ ఆ సంఘంలో ఖచ్చితంగా సభ్యత్వం కలిగి ఉండాలి.ఈ రుణానికి దరఖాస్తు చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలి. అయితే అసైన్డ్‌ భూములు సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారు మాత్రం ఈ రుణాలకు అర్హులు కాదు అని ప్రభుత్వం తెలిపింది.సొంత ఇల్లు ఉన్నవారికి లోన్ మంజూరు చేయడంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఏరోజైతే లోన్ తీసుకుంటున్నారో అప్పటి నుంచి ఏడాదిలోపు అసలుతోపాటు వడ్డీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.