జియో యూజర్లకు అదిరిపోయే తీపికబురు! రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ గూగుల్‌తో జతకట్టి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జియో వినియోగదారులకు జెమిని ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది.
ఈ ప్లాన్ విలువ ఏకంగా 35,100 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉచిత ప్లాన్ ఈరోజు నుంచే అందుబాటులోకి రానుంది.
మొదటి దశలో, 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మరియు అన్లిమిటెడ్ 5g ప్లాన్ కలిగిన జియో యూజర్లు ఈ ఆఫర్‌ను పొందడానికి అర్హులు. త్వరలోనే, మిగతా వినియోగదారులకు కూడా ఈ ప్లాన్ దశల వారీగా అందుబాటులోకి రానుంది.
































