మధ్యతరగతికి గొప్ప అవకాశం:తక్కువ ధరకే హైదరాబాదులో స్వగృహ ఫ్లాట్లు,ప్లాట్లు

హైదరాబాదు పరధిలో సొంత ఇల్లు ఉండాలనే కల ఇప్పటివరకు నెరవేర లేదా..? అయితే మీరు కన్న సొంతింటి కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది.హైదరాబాదు నగర పరిధిలో సరసమైన ధరలతో,క్లియర్ టైటిల్స్,పారదర్శక విధానంతో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ గృహాలు, స్థలాలు మధ్యతరగతి కుటుంబాల కోసం రూపొందించబడ్డాయి.


హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలనుకునే వారికి నిజంగా ఇది గొప్ప అవకాశం అని చెప్పాలి.

బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఫ్లాట్లు..!

బండ్లగూడ (నాగోల్ వైపు), పోచారం (ఇన్ఫోసిస్ సెజ్ దగ్గర) వంటి ప్రాంతాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఇక్కడే 1BHK ఫ్లాట్లు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో 2BHK ఫ్లాట్లు రూ.19 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య అందుబాటులో ఉన్నాయి.ఇక ఈ గృహాల సముదాయం నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లకు దగ్గరగాను, ఐటీ కంపెనీలు సెజ్‌లకు సమీపంలో ఉన్నాయి. ఇక యశోద, కామినేని వంటి ప్రముఖ ఆస్పత్రులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు పరిసర ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్పష్టమైన డాక్యుమెంట్లతో ఫ్లాట్స్ ఉన్నాయి.

ఇక ఈ గృహాల్లో అన్ని హంగులున్నాయి. అధునాతన సౌకర్యాలతో నిర్మించడం జరిగింది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు. వృద్ధుల శ్రేయస్సు కోరి సింగిల్ బెడ్‌ రూం ఫ్లాట్లు ప్రత్యేకంగా కేటాయించబడతాయి. ఈ కేటాయింపు పారదర్శకతతో కూడిన లారీ విధానం ద్వారా జరుగుతుంది.

ఇక స్థలాలు కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉన్నాయి. స్థలాలపై ఇప్పుడు పెట్టుబడి పెట్టడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నవారవుతారు. అభివృద్ధి చెందుతున్న కుర్మల్ గూడ, బహదూర్‌పల్లి,తొర్రూర్ ప్రాంతాల్లో 200 గజాల పైగా స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఓఆర్ఆర్‌కు దగ్గరగా, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, వాణిజ్య కేంద్రాలకు దగ్గరా పారదర్శక వేలం విధానం ద్వారా కేటాయించడం జరుగుతుంది.స్పష్టమైన టైటిల్స్, రిజిస్ట్రేషన్‌కు సిద్ధంగా ప్లాట్లు ఉన్నాయి.

గృహాల దరఖాస్తు గడువు తేదీలు:

బండ్లగూడ :దరఖాస్తుకు జూలై 29వ తేదీ ఉండగా లాటరీ జూలై 30వ తేదీన నిర్వహిస్తారు.

పోచారంలో ధరఖాస్తుకు చివరి తేదీ జూలై 31 కాగా, లాటరీ ఆగష్టు 1వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.

బండ్లగూడ ఫ్లాట్ల కోసం సంప్రదించాల్సిన నెంబరు 7702977006, పోచారం ఫ్లాట్ల కోసం 9959989482.

ప్లాట్ల EMD చెల్లింపు తేదీలు: ఆగష్టు 2 నుంచి 19వరకు

వేలం తేదీలు: ఆగష్టు 4,5,6,20వ తేదీలు. స్థలాల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు

కుర్మల్‌గూడ: 8121022230

బహదూర్‌పల్లి: 7999455802

తొర్రూర్ : 8688468930

ఇక పూర్తి వివరాల కోసం అంటే అర్హత,ప్లాన్‌లు, మ్యాప్‌లు చూడటానికి అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి:

రాజీవ్ స్వగృహ పథకం:

రాజీవ్ స్వగృహ పథకం వాస్తవానికి 2007లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైంది. పట్టణ మరియు నగర శివార్లలోని మధ్యతరగతి వారికి సరసమైన ధరల్లో గృహాలను అందించాలనే లక్ష్యంతో రాజీవ్ స్వగృహ పథకం కింద ఈ ఫ్లాట్ల నిర్మాణం జరిగింది. అయితే, గతంలో ఆరుసార్లు వేలం వేయగా అందులో వందలాది ఫ్లాట్లు, వేలాది ప్లాట్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటిని మరోసారి విక్రయానికి ఉంచింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.