పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే.. ఈ ఆకుకూర తినండి రిజల్ట్ చూస్తే షాక్‌ అవుతారు.

www.mannamweb.com


ఆకుకూరలు కేవలం ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయి.

ఆరోగ్యనిపుణుల ప్రకారం చలికాలంలో ఆకుకూరలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అని చెబుతున్నారు. చలికాంలో గ్రీన్ సాగ్‌ బతువా తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఉండే కొవ్వు సులువుగా తగ్గుతుంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ వంటి ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు గ్రీన్‌ సాగ్ బతువా ఎంతో మంచి ఎంపిక.ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. బతువాలో తక్కువ కేలరీలతో పాటు ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల అతిగా ఆకలి అవ్వకుండా ఉంటుంది. దీని వల్ల జంక్‌ఫూడ్ తినడానికి ఇష్టపడరు. అలాగే ఇందులో ఉండే ఐరన్‌, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్‌ వంటి పోషకాలు పొట్ట మీద ఉండే కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అయితే బతువా ఆకును ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. చాలా మంది ఆకుకూరలను తినడానికి ఇష్టపడరు కాబట్టి దీంతో రుచికరమైన రోటీలను తయారు చేసుకోవచ్చు. లేదా పప్పుగా కూడా తీసుకోవచ్చు.

గ్రీన్ సాగ్‌ బతువా రోటీ ఎలా తయారు చేసుకోవాలి:

గ్రీన్ సాగ్‌ బతువా రోటీ ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం.

కావలసిన పదార్థాలు:

1 కట్ట గ్రీన్స్
1 కప్పు బజ్జ పిండి
ఉప్పు తగినంత
నీరు
నూనె

తయారీ విధానం:

సాగ్‌ను కడిగి, మెత్తగా తరిగి, బ్లెండర్‌లో మెత్తగా చేయండి. ఒక పాత్రలో బజ్జ పిండి, ఉప్పు, సాగ్ పేస్ట్ వేసి, అవసరమైనంత నీరు కలిపి మృదువైన పిండి చేయండి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, రోటీలు వాలండి. తవా వేడి చేసి, రోటీలను రెండు వైపులా నూనె రాసి వేయించండి.

అదనపు టిప్స్:

మరింత రుచి కోసం, పిండిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేయవచ్చు.
రోటీలను మరింత మృదువుగా చేయడానికి, వేయించిన తర్వాత వాటిని ఒక పాత్రలో కప్పి ఉంచండి.
ఈ రోటీలను పెరుగు లేదా చట్నీతో తినవచ్చు.

గమనిక: మీరు బజ్జ పిండి బదులుగా గోధుమ పిండిని కూడా ఉపయోగించవచ్చు.