ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పలు కలకలం రేపాయి. మండలంలోని మాధవరంలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపారు.
ఈకాల్పుల్లో హన్మంతు 50, రమణ 30 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలు అయిన వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులిద్దరు పాత సమానుల వ్యాపారం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.