ఓటీటీలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

guruvayoor ambalanadayil ott: ఓటీటీలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


ఇటీవల కాలంలో ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు మిగిలిన భాషల్లో అనువాదం చేసి అందుబాటులోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మలయాళంలో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళం మూవీ అందుకు సిద్ధమైంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ (Guruvayoor Ambalanadayil ott). విపిన్‌ దాస్‌ దర్శకుడు. బసిల్‌ జోసెఫ్‌, రేఖ, నిఖిలా విమల్‌, అనస్వర రాజన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మే 16న కేరళలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.90కోట్లు వసూలుచేసింది. ఇప్పుడు ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జూన్‌27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కథేంటంటే: విను రామచంద్రన్‌ (బసిల్‌ జోసెఫ్‌) దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటాడు. అతడికి అంజలి (అనస్వర రాజన్‌)తో నిశ్చితార్థం అవుతుంది. పార్వతి (నిఖిలా విమల్‌)తో బ్రేకప్‌ అయి ఐదేళ్లు అయినా ఆ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంటాడు. విను వాటి నుంచి బయటపడేందుకు అతని బావ ఆనంద్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) సాయం చేస్తుంటాడు. అయితే, ఆనంద్‌ లైఫ్‌ కూడా ఏమీ హ్యాపీగా ఉండదు. భార్యకు దూరంగా జీవిస్తూ ఉంటాడు. తనకి ఎంతో సపోర్ట్‌గా ఉన్న ఆనంద్‌ జీవితంలో సంతోషాన్ని నింపాలని విను అనుకుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అనుకోని వ్యక్తిని కలుస్తారు. దీంతో వీరి బంధం బీటలు వారుతుంది. ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అంజలిని విను వివాహం చేసుకున్నాడా? ఆనంద్‌ తన భార్యను కలిశాడా? విను పెళ్లి ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అన్నది ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ చిత్ర కథ.