H-1B కొత్త షాక్! భారతీయులకు అమెరికా డోర్స్ క్లోజ్ అంటున్న ట్రంప్

మెరికాలో H-1B వీసా రూల్స్ మళ్లీ కొత్త మార్పులకు సిద్ధమవుతుంది. ట్రంప్ కొత్త నిబంధనలను మళ్లీ తీసుకొస్తూ, ఉద్యోగుల పై కఠినత్వం పెంచడం, ఎక్కువ వేతనమున్న ఉద్యోగులను ప్రాధాన్యం ఇవ్వడం మొదలైన ఫీచర్లు చేర్చబోతున్నారు.


ఇది ప్రత్యేకంగా భారతీయ IT ప్రొఫెషనల్స్ కోసం పెద్ద సవాలు అవ్వొచ్చు.

కొత్త రూల్స్ ఏమిటి?

డిసెంబర్ 2025లో కొత్త రూల్ ప్రపోజ్ చేయబోతోంది. ఇది హై-ఎడ్యుకేషన్ లేదా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్లలో పని చేసే ఉద్యోగుల అర్హతను మళ్లీ సెట్ చేస్తుంది. కాబట్టి, కొన్ని గ్రూపులు H-1B కోసం కోసరు eligibility కోల్పోవచ్చు.

ఆగస్ట్ 2025 నుండి H-1B లాటరీలో పెద్ద మార్పు రాబోతోంది. కొత్త రూల్స్ ప్రకారం, ఎక్కువ వేతనమున్న అభ్యర్థులను ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అంటే, జీతం ఎక్కువగా ఉన్న ఉద్యోగులకి H-1B వీసా పొందే అవకాశం ఎక్కువ, కొత్త గ్రాడ్యుయేట్స్, దీనివల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు వెనుకపడతారు. స్టాఫింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీలకి కూడా ఇది సవాల్ లా మారుతుంది. ఎందుకంటే వారు తరచుగా జీతం తక్కువ ఉన్న జాబ్ హోల్డర్స్ ని H-1B కింద తీసుకుంటారు. అందుకు ఇప్పుడూ వస్తున్న కొత్త సిస్టమ్‌లో ఫ్రెషర్లు, కొత్త గ్రాడ్యుయేట్లు, తక్కువ జీతం పొందే కార్మికులు H-1B లాటరీలో పోటీగా నిలవాలంటే ఎక్కువ నైపుణ్యాలు, అనుభవం అవసరం అవుతుంది. మొత్తం మీద, వేతన ఆధారిత ఎంపిక మరియు అధిక వేతనంతో ఉన్న ఉద్యోగులకు ఇదొక ప్రయోజనం. కానీ ప్రవేశ స్థాయి మరియు తక్కువ జీతం ఉన్న ఉద్యోగులు ఇబ్బందిలో ఉంటారు.

ట్రంప్ ఇప్పుడూ ఇంకా కఠిన నియమాలను తీసుకొస్తున్నారు. కంపెనీలు ఉద్యోగులు ఏ పని చేస్తున్నారు, H-1B కాలంలో నిజంగా ఆ పని చేస్తున్నాన్నారో లేదో చూపించాలి. “ఎంప్లాయర్-ఎంప్లాయీ” నిబంధనలు కఠినంగా ఉండటంతో స్టాఫింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీలకి కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇలాంటి కొత్త H-1B రూల్స్ అమలు అయితే, గతంలో H-1B వీసా తీసుకుని అమెరికాలో IT కాంట్రాక్టర్లుగా, ఫ్రెషర్లుగా పనిచేసిన వాళ్లకూ కొత్త సవాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకి, కొంతమంది ఫ్రెషర్లు, జూనియర్ కోడర్స్, స్టాఫింగ్ కంపెనీల ద్వారా అమెరికాకు వెళ్లి తమ కెరీర్ మొదలెట్టారు. ఇంతవరకు వారు సాధారణంగా H-1B లాటరీ ద్వారా సులభంగా ఎంపిక అయ్యారు, కానీ ఇప్పుడు వేతన ఆధారిత ప్రాధాన్యం,కఠినమైన యజమాని-ఉద్యోగి నియమాలు, ఒప్పంద ధృవీకరణ వంటి కొత్త నిబంధనలు వస్తే, అలాంటి ఫ్రెషర్లలకూ, కొత్తగా ప్రవేశించేవారికి అవకాశాలు తగ్గవచ్చు.

భారతీయులు H-1B వీసా సిస్టంలో ఎప్పటికీ పెద్ద సంఖ్యాలో ఉంటారు. FY 2023లో కొత్త ప్రారంభ వీసాల్లో 58% భారతీయులు, రీన్యూవల్‌లలో 79% భారతీయులే ఉన్నారు. అంటే H-1B మార్పులు ప్రధానంగా ఈ సంఖ్యను ఎక్కువ ప్రభావితం చేస్తాయి. కొత్త రూల్స్, వేతన ఆధారిత ఎంపిక, కఠినమైన నియమాలు వలన కొత్త ఉద్యోగాలు, టెక్ కాంట్రాక్ట్స్ కోసం H-1B పొందడం కాస్త కష్టం అవుతుంది. ఫ్రెషర్లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు, మరియు కొత్త దరఖాస్తుదారులు ఇప్పుడు ఎక్కువ తయారీ, నైపుణ్యాలు, లేదా అనుభవం చూపించకపోతే లాటరీలో ప్రతికూలత చూడాల్సి ఉంటుంది.

H-1B వీసా అనేది ఇండియన్ IT & ప్రొఫెషనల్స్ కోసం ఒక ప్రధాన గేట్. కొత్త నియమాలు కచ్చితంగా ఎఫెక్ట్ చూపుతాయి. ఎంప్లాయర్ వెరిఫికేషన్, కాంట్రాక్ట్ క్లారిటీ, మరియు వేతన ప్రాధాన్యం ఇలా అన్నీ కలిపి, ఉద్యోగాలు & సెక్యూరిటీపై నేరుగా ప్రభావం చూపుతాయి.

H-1B కొత్త రూల్స్ కేవలం IT లేదా టెక్ రంగాన్ని మాత్రమే కాదు, రీసెర్చ్, అధ్యాపక & పరిశోధన రంగం, బయోటెక్, హెల్త్‌కేర్ వంటి ఇతర రంగాల ఉద్యోగాల పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. 85,000 వార్షిక H-1B కాప్‌లో మినహాయింపులు కుదిరే ఉద్యోగాల సంఖ్యకు పరిమితులు రాబోతే, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో పని చేసే భారతీయ ఉద్యోగాలు కూడా దీనికి ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అంటే, విద్య, పరిశోధన రంగంలో ఉండే ఇండియన్లు కూడా కొత్త నిబంధనల వల్ల H-1B వీసా పొందడం కష్టం అవుతుంది.

సాధారణ ఉద్యోగులకే కాకుండా, కొత్త గ్రాడ్యుయేట్స్, టెక్ కాంట్రాక్టర్స్ ఈ మార్పులను కచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంది. H-1Bలో ఉండటం ఇంకా పెద్ద అవకాశంగా ఉన్నా, కానీ కొత్త సవాళ్లను ఎదుర్కోవడం తప్పనిసరి. అమెరికా H-1B ఫీల్డ్ ఇప్పుడు కొత్త పద్ధతుల్లో ముందుకు సాగుతోంది. ఇది ప్రతి భారతీయ ప్రొఫెషనల్ కోసం ఒక ఆవాసం అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.