తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెయిర్‌డై అవసరం లేదు.. ఈ మూడు చాలు

www.mannamweb.com


ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవటం, హెయిర్ డై వాడుతూ సైడ్‌ఎఫెక్ట్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారికి ఓ బెస్ట్‌ హోం రెమిడీ ఉంది..మీకు అందుబాటులో ఉండే ఔషద మూలికలతో మీ తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చేసుకోవచ్చు. ఇది మీ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టును మృదువుగా, నల్లగా చేస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో, జుట్టుకు పోషణ అందించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జుట్టు నెరిసిపోవడం అనేది వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలో జరిగే సహజ ప్రక్రియ. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. లేదంటే ఆగిపోతుంది. దీని వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. మెలనిన్ తగ్గింపు ప్రభావం చర్మం, జుట్టు మీద కనిపిస్తుంది. మెలనిన్ తగ్గడం వల్ల జుట్టు రంగు రంగులోకి మారుతుంది. చర్మం తెల్లగా మారుతుంది. అయితే, చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం వెనుక జన్యుశాస్త్రం, హైపోథైరాయిడిజం, ప్రోటీన్, ఖనిజాల లోపం, విటమిన్ లోపం, బొల్లి, డౌన్ సిండ్రోమ్, కొన్ని వ్యాధులకు మందులు తీసుకోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి.

చాలా మంది తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉండేందుకు తరచుగా జుట్టుకు రంగులు వేస్తారు. ఇలా హెయిర్ డైని ఉపయోగించడం వల్ల జుట్టు మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హెయిర్ డై ఉపయోగించడం వల్ల మిగిలిన నల్లటి జుట్టు కూడా తెల్లగా మారుతుంది. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయంతో కొంతమంది చిన్నవయసులోనే వచ్చిన నెరిసిన జుట్టుతో అలాగే జీవించడం మంచిదని అనుకుంటారు.

మీరు కూడా జుట్టు నెరసిపోయిన జుట్టు సమస్యతో ఆందోళన చెందుతూ, హెయిర్ డై వాడితే ఏమవుతుందోనని భయపడుతూ ఉంటే, మీరు కొన్ని ప్రత్యేకమైన హోం రెమెడీస్ ఉపయోగించి మీ జుట్టుకు రంగు వేయవచ్చు. కొన్ని మూలికలు, కొన్ని ఔషధాలతో మీ జుట్టు తెల్లబడకుండా నిరోధించడంతోపాటు జుట్టును నల్లగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. ఇంట్లోనే జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

కరివేపాకు, ఉసిరి, బ్రహ్మి పొడి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉత్తమమైన ఆయుర్వేద మూలికలు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే కరివేపాకును తీసుకోవడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా జుట్టు నల్లబడుతుంది. కరివేపాకులో జుట్టును నల్లగా చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.. కరివేపాకులో జుట్టుకు చాలా మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, ప్రొటీన్లు తగినంత మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిస్తాయి.

కరివేపాకుతో పాటు ఉసిరికాయను ఉపయోగించడం వల్ల జుట్టు నల్లబడటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరి జుట్టు మీద సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో, జుట్టుకు పోషణ అందించడంలో ఉసిరి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బ్రహ్మీ పొడిని బ్రెయిన్ టానిక్ అని కూడా అంటారు. ఈ పొడి జుట్టు మీద మ్యాజిక్‌లాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. దీన్ని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. క్రమంగా జుట్టు నల్లగా మారుతుంది.

కరివేపాకు, పొడి ఉసిరి, బ్రహ్మి పొడిని ఎలా ఉపయోగించాలి…

కరివేపాకు, పొడి ఉసిరి, బ్రహ్మి పొడి ఈ మూడింటిని మెత్తగా రుబ్బుకుని, దానికి కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ చేయాలి. సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని జుట్టుకు పూర్తిగా అప్లై చేసి గంటపాటు అలాగే వదిలేయండి. ఇలా చేస్తే ఒక గంటలో మీ తెల్లజుట్టు సహజంగా నల్లగా కనిపిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)