చాలామంది ఎలాంటి పని చేసిన కూడా కలిసి రావడం లేదని అంటూ ఉంటారు. అడ్డంకులు ఏర్పడుతున్నాయని ప్రతి పనిలో సమస్యలు ఎదురవుతున్నాయని అంటూ ఉంటారు. దీంతో అదృష్టం లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు.
అలాగే నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. అలాంటప్పుడు కొన్ని రకాల పరిహారాలు పాటించాలి అని చెబుతున్నారు. పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…ఏదైనా పనిలో విజయం సాధించాలంటే సర్వరక్షాకంకణం అనే కంకణాన్ని చేతికి ధరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చట.
అయితే ఈ కంకణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో రెండు గరిక పోసలు, కొన్ని కుంకుమ కలిపిన అక్షింతలు, ఒక రాగి నాణెం ఉంచి ముడివేసుకోవాలి. ఆపై దాన్ని ఏ నెలలోనైనా సరే పౌర్ణమి తిథి నాడు చేతికి ఒక రక్షలాగా కట్టుకోవాలి. దీన్నే సర్వరక్షా కంకణం లేదా కార్య సిద్ధి కంకణంగా పిలుస్తారు. ఇంట్లో ఎవరైనా దీన్ని ధరించవచ్చట. మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు కుడిచేతికి ఆ కంకణాన్ని కట్టుకొని వెళ్తే అందులో తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ పరిహారం కూడా మీ పనులు విజయవంతం అవ్వడంలో చాలా బాగా సహాయపడుతుందట.
అదేంటంటే గణపతిని ఎర్రటి పుష్పాలు, గరిక పోచలతో పూజించాలి. పూజ పూర్తి అయ్యాక గణపతికి సమర్పించిన ఆ గరిక పోచలలో కొన్నింటిని మీ దగ్గర పెట్టుకొని వెళ్లాలి. మీ పని పూర్తి అయ్యి వచ్చాక ఆ గరిక పోచలను ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలట. అలాగే మీరు అనుకున్న పనులు సజావుగా సాగాలి అంటే.. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణలు చేసి బెల్లం, నెయ్యి నైవేద్యంగా పెట్టాలట. ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరైనా పిల్లలకు అరటి పండ్లు పంచిపెట్టి పని మీద బయటకు వెళ్లాలని అప్పుడు ఆ పనుల్లో తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు. ఏదైనా పెద్ద పని పూర్తవ్వడం కష్టమైనట్లు అనిపించిన సందర్భాల్లో ఆంజనేయస్వామి గుడిలో పైన చెప్పిన విధంగా 9 మంగళవారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందట.