Happy Teddy Day 2025: టెడ్డి బేర్ మేకింగ్ బిజినెస్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు

ఫిబ్రవరి నెల అనగానే ప్రేమికుల రోజు, గిఫ్టుల రోజులు గుర్తుకు వస్తాయి. ఇదే నెలలో 10వ తేదీన ‘టెడ్డి డే’ వేడుకలు జరగనున్నాయి.


ఇది ప్రేమికుల మధ్య గిఫ్ట్‌లు ఇచ్చుకోవడానికి పాపులర్ అయిన ఒక రోజు. ఈ సందర్భంలో తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందే మంచి బిజినెస్ టెడ్డి బేర్ మేకింగ్ బిజినెస్. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు టెడ్డి బేర్లు అందరికి ఇష్టమైనవి. వాలెంటైన్స్ డే, పుట్టినరోజులు లేదా పెళ్లి వార్షికోత్సవాలు వంటి వేడుకలకు వాటిని గిఫ్ట్‌గా ఇవ్వడం కామన్.

భారత ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో దేశీయ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. విదేశీ చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారతదేశంలోని చిన్న వ్యాపారాలు స్వదేశీ ఉత్పత్తులు తయారు చేసే వారికి ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది. ఇందులో టెడ్డి బేర్, ఇతర బొమ్మల తయారీ కూడా ఉన్నాయి. మీరు కూడా ఈ మార్గంలో అడుగు పెట్టి ఇలాంటి వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించవచ్చు.

టెడ్డి బేర్ తయారికి అవసరమైన సామగ్రి

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యంగా కొన్ని సామగ్రి అవసరం. సరైన ఫ్యాబ్రిక్, ఫర్, సుట్టు, కుట్టు మిషన్. ఈ మొత్తం సామగ్రి మీద దాదాపు రూ.20,000 నుండి రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇంటి నుంచి కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

టెడ్డి బేర్ డిమాండ్

టెడ్డి బేర్, సాఫ్ట్ టాయ్స్ కు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. వీటిని చిన్నపిల్లలు మాత్రమే కాకుండా, పెద్దలు కూడా గిఫ్ట్ లేదా డెకరేషన్‌ ఐటమ్స్ గా కొనుగోలు చేస్తారు. ఈ వ్యాపారం ప్రారంభంలో తక్కువ పెట్టుబడి తో ఉంటుంది. కానీ వ్యాపారం పెరుగుతున్న కొద్ది మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మొదటి దశలో పెట్టుబడి తక్కువగా ఉంటే కూడా దాన్ని వ్యాపార విస్తరణతో భాగంగా పెంచుకోవచ్చు.

మార్కెటింగ్ కూడా అవసరం

ఈ వ్యాపారాన్ని విజయవంతంగా మార్చడానికి మార్కెటింగ్ ఎంతో ముఖ్యమైన అంశం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా మీరు మీ టెడ్డి బేర్ల బ్రాండింగ్ చేయవచ్చు. అలాగే, వ్యాపార షోలలో, గిఫ్ట్ ఎక్స్‌పోస్‌లో పాల్గొనడం ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి 10న ‘టెడ్డి డే’ నేపథ్యంలో, మీరు చిన్న పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలుపెట్టి మంచి లాభం పొందవచ్చు.