సంక్రాంతి వేళ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. ఈ నంబర్‌ గుర్తుంచుకోండి

సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మహానగరం నుంచి ప్రజలు సొంతూళ్లకు తరలివెళ్తుండటంతో పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.


వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గమైన భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. అటు సంక్రాంతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు విపరీతంగా ఛార్జీలు పెంచినట్టు ఫిర్యాదులు రావడంతో రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ ఛార్జీల కంటే 50 శాతం మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబరు 92816 07001ను సంప్రదించాలని సూచించింది. 18వ తేదీ వరకు ట్రావెల్స్‌ బస్సుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొంది.

పలు ట్రావెల్స్‌ యజమానులు విమాన ప్రయాణంతో సమానంగా చార్జీలు పెంచాయి. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ చేసే దోపిడీ నివారణకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. విపరీతంగా చార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్ పై రవాణాశాఖ చర్యలకు సిద్దమైంది. ప్రైవేటు ట్రావెల్స్ పై ఫిర్యాదులకు రవాణాశాఖ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు చేస్తే 9281607001 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించింది. ప్రయాణికులు ఫోన్ చేస్తే సంబంధిత ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రైవేటు ట్రావెల్స్ ను తనిఖీలు చేసేందుకు రవాణాశాఖ ప్రత్యేకంగా బృందాలని నియమించింది. నిబంధనలకు ఉల్లంఘించిన ప్రైవేటు ట్రావెల్స్ ను సీజ్ సహా కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ హెచ్చరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.