రైల్వేలో 8,868 ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,868 ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్‌, 3,058 పోస్టులు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,868 ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్‌, 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌లో భర్తీ చేయనుంది. ఇంటర్‌, డిగ్రీ అర్హతలతో ఈ నియామకాలకు రైల్వే బోర్డు ఎంపిక చేయనుంది.


ఈ పోస్టులకు ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసేందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్‌ 27తో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్ధులు ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సూచించింది. గత అక్టోబర్‌లో ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్‌లోని గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు 3,423 వరకు ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులు 921, స్టేషన్ మాస్టర్ పోస్టులు 615, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 638, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు 161, మెట్రో రైల్వేలో ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 59 వరకు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ పోస్టులు 2,424 వరకు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 394, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 163, రైళ్ల క్లర్క్ పోస్టులు 77 వరకు ఉన్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.