AP Gurukula Admissions: ఏపీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేశారా..? గడువు ముగియనుంది.

ఏపీలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (APSWREIS) 5వ తరగతి, ఇంటర్​మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. ఈ నెల ఆరో తేదీతో గడువు ముగియనుంది. కాబట్టి ఇంటర్​లేదా ఐదో తరగతిలో చేరాలనుకుంటున్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.ఆన్​లైన్​లో ఈదరఖాస్తును స్వీకరిస్తారు. https://apbragcet.apcfss.in/ అనే వెబ్​సైట్​ద్వారా దరఖాస్తు (APBRAG CET) చేసుకోవలసి ఉంటుంది. ఆన్​లైన్​లో అప్లై చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. పరీక్షలో మెరిట్​ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ గురుకులాల్లో ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తారు. పౌష్టికాహారం లభిస్తుంది. ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు, స్టూడెంట్ స్టేషనరీ అందజేస్తారు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడలలో శిక్షణను అందిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా బోధన ఇంగ్లీష్​ మాధ్యమంలో ఉంటుంది.


ఇంటర్​ప్రవేశ పరీక్ష ఏప్రిల్​ఆరో తేదీన, ఐదో తరగతి ప్రవేశపరీక్ష (BRAGCET 2025) ఏప్రిల్​20 వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్​ప్రవేశానికి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 2024_25లో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐదో తరగతి అడ్మిషన్​ కోరే అభ్యర్థి 2021-22, 2022-23లో 3వ, 4వ తరగతులలో రెండు సంవత్సరాలపాటు స్థానిక జిల్లాలో చదివి ఉండాలి. https://apbragcet.apcfss.in/pdfs/english_telugu_merged.pdf ఈ లింక్​పై క్లిక్​చేస్తే మీకు పూర్తి వివరాలతో కూడిన బ్రోచర్​పీడీఎఫ్​రూపంలో వస్తుంది. అందులో ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అర్హత ఏమిటి..? అనే వివరాలు ఉంటాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.