పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి ది రాజాసాబ్. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక గత కొంతకాలంగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. అలా ఏడాది కూడా గడిచిపోయింది. ఇక వాయిదాలు అంటే అభిమానులు కూడా భయపడుతున్నారు. దీంతో అభిమానుల అసహనాన్ని గమనించిన మేకర్స్ ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ ను రంగంలోకి దింపింది. జనవరి 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ డేట్ ఇంకా రెండు నెలలు కూడా లేదు అయినా రాజాసాబ్ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు.
ఒక అప్డేట్ లేదు.. ప్రమోషన్స్ సాంగ్స్ లేవు.. ఈసారి కూడా వాయిదా అనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ, ఆ రూమర్స్ ను నిర్మాత ఖండించాడు. రాజాసాబ్ అనుకున్న సమయానికే వస్తుందని తెలిపాడు. ఇక ఎందుకు ఇంత లేట్ అంటే.. షూటింగ్ ఇంకా పూర్తికాలేదని సమాచారం. తాజాగా ది రాజాసాబ్ నుంచి ఒక సర్ప్రైజ్ అప్డేట్ ను డైరెక్టర్ మారుతీ అభిమానులతో పంచుకున్నాడు. నేటితో రాజాసాబ్ షూట్ ను ప్రభాస్ ముగించాడు అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈరోజు ప్రభాస్ కు ఎంతో స్పెషల్ డే అన్న విషయం అందరికీ తెల్సిందే. నేటితో ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్ళు. అంటే డార్లింగ్ నటించిన ఈశ్వర్ సినిమా రిలీజైన రోజు అన్నమాట. ఇదే రోజు 23 ఏళ్ళ క్రితం ఈశ్వర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇదే రోజు రాజాసాబ్ షూట్ ను ప్రభాస్ ఫినిష్ చేశాడు. ఇదే విషయాన్నీ మారుతీ చెప్పుకొచ్చాడు. “23 సంవత్సరాల క్రితం ఆయన సినిమాల్లోకి తొలి అడుగు వేశారు. ఈరోజు ఆయన తన ప్రయాణాన్ని ది రాజాసాబ్ లో అదే రోజున ముగించారు. అతని విజయవంతమైన ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
రాజా సాబ్ పూర్తిగా బిన్నంగా ఉంటుందని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. మీ ప్రేమ మాకు తెలుసు.. ఉత్తమమైన దానినే మీకు అందిస్తామని మీకు హామీ ఇస్తున్నాం. రెబల్ భక్తులకు మరిన్ని సంబరాలు ముందు ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.
































