బిగ్ బాస్ హౌస్ మొత్తానికి అతనొక్కడే ఎంటర్టైనర్..

బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ ఆటకు ఆట ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ అదరగొట్టేస్తున్నాడు. జబర్దస్త్ నుంచి వచ్చే ప్రతి కంటెస్టెంట్ బిగ్ బాస్ లో తమ టాలెంట్ చూపించడం అన్నది జరుగుతుంది.


అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 4లో అవినాష్ వచ్చాడు ఆ సీజన్ లో అతని ఎంటర్టైన్మెంట్ అలరించింది. ఐతే ఆ తర్వాత ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యిందని అనిపించింది. మళ్లీ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ ఆ బాధ్యత తీసుకున్నాడు.

హౌస్ లో ఎలాంటి పరిస్థితుల్లో అయినా..

హౌస్ లో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇమ్మాన్యుయెల్ అందరు ఒకచోట కూర్చున్నప్పుడు తన స్కిట్స్ తో.. తనూజని ఫ్లర్టింగ్ చేస్తూ చెప్పే డైలాగ్స్ అలరిస్తున్నాయి. అగ్గిపెట్టే మచ్చలా మాట్లాడుతూ ఒకరోజు ఇమ్మాన్యుయెల్ అలరించాడు. ఇక లేటెస్ట్ గా వైల్డ్ కార్డ్ ని అడ్డుకునేందుకు బిగ్ బాస్ లీడర్ బోర్డ్ టాస్క్ ఇవ్వగా అందులో ఒక రౌండ్ అయిపోయాక స్క్రీన్ మీద బిగ్ బాస్ టీం వైజ్ పాయింట్స్ ఇస్తాడు. అలా సుమన్ శెట్టి, శ్రీజన్ జంటకు లీస్ట్ పొజిషన్ వచ్చింది.

అలా వచ్చిన సుమన్ శెట్టి ని ఆ పాయింట్స్ పట్టికలో ఉన్న జట్ల గురించి ఒకటి ఒకటి ఒకటి అంటూ పరీక్షల్లో ప్రభంజనం అంటూ వచ్చే ఒక యాడ్ ని ఇమిటేట్ చేస్తూ అదే వాయిస్ ని దించి ఇమ్మాన్యుయెల్ అదరగొట్టాడు. మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా ఇమ్మాన్యుయెల్ మాటలకు కడుపుబ్బా నవ్వారు. సుమన్ శెట్టి గురించి కాస్త ఎక్కువసేపు ఇమ్మాన్యుయెల్ మాట్లాడే సరికి అతను కూడా అలా అమాయకంగా నవ్వుతూ ఉన్నాడు.

ట్రూ ఎంటర్టైనర్ గా..

ఇమ్మాన్యుయెల్ తనకు దొరికిన ఏ ఛాన్స్ ని వదలకుండా అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో అతను ఒక ట్రూ ఎంటర్టైనర్ గా అటు టాస్కుల్లో తన బెస్ట్ ఇస్తూనే ఫ్రీ టైంలో హౌస్ మెట్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. ముఖ్యంగా తనూజని ఫ్లర్ట్ చేస్తూ ఆమె బాయ్ ఫ్రెండ్ లా ఇమ్మాన్యుయెల్ చేసే కామెంట్స్ భలే ఉంటుంది. సో ఇదే దూకుడుతో ఇమ్మాన్యుయెల్ టాస్కులు, ఆట, ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్తే టాప్ 5 కాదు టాప్ 3 పక్కా అని చెప్పొచ్చు.

ఈ సీజన్ లో కామెడీ చేయడం అంటే అది ఇమ్మాన్యుయెల్ వల్లే అవుతుంది అనేలా పరిస్థితి ఉంది. మొదటి రెండు వారాలు కేవలం ఆటల్లోనే ఇంప్రెస్ చేసిన ఇమ్మాన్యుయెల్ తన బలమైన కామెడీతో ఇప్పుడు హౌస్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఓ పక్క సంజనాతో మదర్ సన్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాడు ఇమ్మాన్యుయెల్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.