నొప్పి, రిస్క్ లేకుండా చెవులను శుభ్రం చేసే హెడ్​ఫోన్స్

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. దీని పేరు స్మార్ట్ ఇయర్ క్లీనర్.


ఈ పరికరం చెవులు శుభ్రం చేయడానికి సాధారణ పద్ధతులను మార్చగలదని నిరూపించింది. దీనిని ఉపయోగించడం ద్వారా చెవులు చాలా బాగా శుభ్రం అవుతాయి. ఈ కొత్త టెక్నాలజీకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని అందరూ చూస్తూనే ఉన్నారు.

ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలంటే..

ఈ స్మార్ట్ ఇయర్ క్లీనర్ హెడ్ఫోన్ లాగా కనిపిస్తుంది. కానీ దీని పని పాటలు వినేందుకు కాదు. చెవులను శుభ్రం చేసుకోవడానికి. వీడియోలో ఒక మహిళ ఈ పరికరాన్ని ధరించి.. దానిని ఉపయోగిస్తోంది. ఈ పరికరం చెవిలోని మురికిని ఎంత బాగా శుభ్రం చేస్తుందో వీడియోలో చూడవచ్చు. నిపుణుల సమాచారం ప్రకారం.. ఈ పరికరంలో చిన్న కెమెరా, క్లీనింగ్ టూల్స్ ఉంటాయి. ఇవి చెవిలోని మురికిని శుభ్రం చేయడంతోపాటు.. దానిని ఎలా క్లీన్ చేస్తాయో లైవ్ స్ట్రీమ్లో కూడా చూపించేలా రూపొందించారట.

ఇకపై చెవుల శుభ్రత నిమిషాల్లోనే

ఈ పరికరాన్ని ఉపయోగించడం చాలా సులభం. పైగా పూర్తిగా సురక్షితం. దీనివల్ల చెవులు శుభ్రం చేయడం ఇప్పుడు నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై చాలామంది ఆసక్తి కూడా కలిగింది.

చెవి శుభ్రత అనేది అందరికీ చాలా ముఖ్యం. గులిమి పేరుకుపోయినప్పుడు వినికిడిలో మార్పులు ఉంటాయి. అంతేకాకుండా చెవినొప్పి రావడం వంటివి జరుగుతుంది. దాని శుభ్రత కోసం చాలామంది ఇయర్ బడ్స్ వాడుతారు కానీ.. అవి అంత మంచివి కాదని చెప్తారు. పైగా అవి గులిమిని మరింత లోపలికి పంపేస్తాయని.. దీనివల్ల మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయని అంటున్నారు. అంతేకాకుండా చెవిలో ఏవి పడితే వాటిని పెట్టడం పోయడం వల్ల చెవి, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరికరం ఆ సమస్యలకు చెక్ పెడుతూ.. చెవులను ఈజీగా, నొప్పి లేకుండా శుభ్రం చేస్తుందని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.