ఈ 5 పండ్లు తింటే ఎంత వయసొచ్చినా మహేష్ బాబులానే ఉంటారు, ధర కూడా తక్కువే!

వయస్సు పెరుగుతున్న కొద్దీ మన చర్మంపై వృద్ధాప్య లక్షణాలు కనిపించడం సహజమే. అయితే, ఈ లక్షణాలను కొంతకాలం కనిపించకుండా చేయడం కూడా సాధ్యమే. కొన్ని ఆహార అలవాట్లను మార్చుకుంటే, మీరు చర్మాన్ని యవ్వనంగా, మెరుస్తూ ఉండేలా చేసుకోవచ్చు.


అయితే ఈ స్టోరీలో 60 ఏళ్లలో కూడా 30 ఏళ్ల మాదిరిగా కనిపించాలంటే తినాల్సిన కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.

1. దానిమ్మ

దానిమ్మలో ఉన్న విటమిన్ C, పాలీఫినోల్స్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇవి సహజంగా కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో చర్మం ముడతలు లేకుండా, మెరిసేలా ఉంటుంది. చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగించడంలో దానిమ్మను వినియోగించవచ్చు.

2. పెర్సిమన్

పెర్సిమన్ పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C, పొటాషియం చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ పండు కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి, చర్మం ముడతలు పడడాన్ని నిరోధిస్తుంది. పెర్సిమన్ తినడం వల్ల వృద్ధాప్య ప్రభావాలను తగ్గించుకోవడంతో, చర్మాన్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచుకోవచ్చు.

3. స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు చిన్ని పరిమాణంలో ఉన్నా, చర్మానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ C మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల చర్మం మెరుస్తుంది, అలాగే రంగు మచ్చలు తొలగిపోతాయి.

4. బ్లూబెర్రీలు

బ్లూబెర్రీలలో విటమిన్ C, K, B6, మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి, అలాగే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచేందుకు బ్లూబెర్రీలు చాలా ఉపయోగపడతాయి.

5. బొప్పాయి

బొప్పాయి పండులో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్ A, C, E, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ పై పోరాటం చేసి, చర్మ వృద్ధాప్య ప్రభావాలను తక్కువ చేస్తాయి. పొడిబారిన చర్మాన్ని సద్దుమణిగా ఉంచడంలో బొప్పాయి అనేది అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఈ పండ్లు మన ఆహారంలో చేర్చుకుంటే, చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.