ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాల్లో పాలు కలిపి తీసుకుంటే చలిలో ఉపశమనం ఇస్తుంది. ఖర్జూరం, పాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి.
పాలు, ఖర్జూరంతో కలిపి తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక చాలా శక్తివంతమైనదిగా చెబుతున్నారు. రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రాత్రిపూట ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో శక్తిని కాపాడుతుంది. ఖర్జూరం పాలతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పాలతో ఎండు ఖర్జూరాలను తీసుకుంటుంటే రోగనిరోధక శక్తి పెరిగి పవర్ బూస్టరులా పనిచేస్తుంది. చర్మానికి కూడా కొత్త కాంతినిస్తుంది. రక్తం లోపాన్ని తొలగిస్తుంది. రక్తపోటును నియంత్రించే శక్తి ఖర్జూరాలనుకున్నాయి. దంతాలు, ఎముకలకు మేలు చేస్తాయి..
ఖర్జూరంలో సహజమైన చక్కెర ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. పాలలో ఉండే ప్రొటీన్లు శరీరాన్ని ఎక్కువ కాలం శక్తివంతంగా ఉంచుతాయి. పాలు కాల్షియం మంచి మూలం. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.
ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. పాలు జీర్ణవ్యవస్థను కూడా శాంతపరుస్తాయి.
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. చర్మం మెరుస్తూ ఉండాలంటే తరుచుగా ఖర్జూరాతో పాటు పాలు కలిపి తీసుకోవడం మంచిది. ఖర్జూరం, పాలు తీసుకోవడం మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.
కొన్ని ఖర్జూరాలను రాత్రి పాలలో నానబెట్టండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఖర్జూరా పాలతో కలిపి తినండి. మీకు ఏదైనా రకమైన అలర్జీ ఉంటే ఖర్జూరం, పాలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ తీసుకోవడం నియంత్రణలో ఉండాలి. ఖర్జూరాన్ని ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది.