Health Tips : రాత్రి పడుకొనే ముందు సోంపును ఇలాంటి తీసుకుంటే.. ఆ సమస్యలు ఇక జన్మలో రావు..

www.mannamweb.com


మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో సోంపు కూడా ఒకటి.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా జీర్ణ సమస్యలను తగ్గించడంతో పాటు షుగర్ ను నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది..
ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి మీ జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మధుమేహం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.. వీటిని షుగర్ పేషెంట్లు పడుకునే ముందు సోంపు నమలడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది చక్కెర జీవక్రియలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులోని ఫైటోకెమికల్స్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి..

చాలా మంది జీర్ణ సమస్యలతో భాధ పడుతున్నారు.. మలబద్ధకం తో ఇబ్బంది పడుతున్నారు.. అలాంటి వారికి సోంపు చక్కని మెడిసిన్.. జీవక్రియ రేటును పెంచుతుంది ప్రేగు కదలికను వేగవంతం చేస్తుంది. ఇది మలానికి పెద్దమొత్తంలో జోడించడానికి పని చేస్తుంది. ఇది మలాన్ని సులభతరం చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.. అంతేకాదు కళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.. గ్లాకోమా నుండి కూడా రక్షిస్తుంది. డయాబెటిస్‌లో సోంపును నమలడం వల్ల రెటినోపతి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యల నుంచి రక్షిస్తుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.