Health Tips: వీటిని రోజుకు రెండు తీసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..
అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి అప్రికాట్.. దీన్ని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అప్రికాట్ గురించి అందరికి తెలుసు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ముఖ్యంగా విటమిన్ ఎ, సిలు అధికంగా ఉంటాయి.. బీటా కెరోటిన్, లుటీన్, పోటాషియం, యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అందుకే వీటిని రోజు మీ డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అంతేకాదు కండరాల సంకోచాన్ని తగ్గిస్తుంది.. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..
హైబీపిని కంట్రోల్ చెయ్యడంలో ఇవి సహాయ పడతాయి.. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. ఇక వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.. దాంతో ఎక్కువసేపు తినకుండా ఉంటారు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది.. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..