Heart Attackతో 8వ తరగతి విద్యార్థి మృతి

www.mannamweb.com


వనపర్తి జిల్లాలో విషాదం జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుతో అక్కడికక్కడే పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, గోపాల్‌పేటలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌లో ఏదుట్ల గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థికి సోమవారం గుండెపోటు వచ్చింది. ఉదయం 7 గంటలకు చదువుకోవడానికి ఆవరణలో కూర్చున్న బాలుడు 10 నిమిషాల తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరీక్ష చేయగా నాడి అందడం లేదని 108 అంబులెన్సులో వనపర్తికి తరలించాలని సూచించారు.

అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి అరుణ గుండెలవిసేలా విలపించారు. గతేడాది తన భర్త, ఇటీవల అత్త మృతి చెందారని, ఇప్పుడు కుమారుడు దూరమయ్యాడని తెలిపారు. బాలుడి స్నేహితులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.