గుండెపోటు హెచ్చ‌రిక‌.. అక్క‌డ నొప్పులు వ‌స్తే ఏ మాత్రం విస్మ‌రించ‌వ‌ద్దు.

www.mannamweb.com


ఒక‌ప్పుడు గుండెపోటు అనేది ముస‌లి వ‌య‌స్సు వాళ్ల‌కి మాత్ర‌మే వచ్చేది. కాని ఇప్పుడు మాత్రం యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు దాడి చేసి ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది దీని బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐదుగురిలో నాలుగు మరణాలు గుండెపోటు, పక్షవాతం కారణంగా సంభవిస్తున్నాయి. సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన గుండెపోటు అనేది గుండె కండరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి తగినంత రక్తం అందనప్పుడు గుండెపోటు వస్తుంది.. అయితే గుండెపోటు వ‌చ్చే ముందు మ‌న‌కి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం విస్మ‌రించ‌కూడ‌దు.

ఛాతి ఎడమవైపున లేదా మధ్యలో తేలికపాటి నుంచి అసౌకర్యమైన నొప్పి, ఒత్తిడి, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అలర్ట్ కావాలంటున్నారు. ఛాతి నొప్పి గుండెపోటును సూచించే అత్యంత సాధారణ హెచ్చరిక సంకేతాలలో ఒకటని ఆయన పేర్కొన్నారు. నొప్పి సాధారణంగా ఎడమ చేతిని ప్రభావితం చేస్తుంది, కానీ కొన్నిసార్లు ఇది రెండు చేతులను ప్రభావితం చేస్తుంది. నొప్పి తరచుగా ఛాతీ నుంచి ఎడమ చేయి వరకు వ్యాపించడం వంటి లక్షణాలు అనుభవిస్తున్నట్లయితే వెంటనే అప్రమత్తం కావాలంటున్నారు నిపుణులు. ఇది కూడా గుండెపోటుకు మరొక హెచ్చరిక సంకేతం కావొచ్చని చెబుతున్నారు.

కొన్నిసార్లు ఆ నొప్పి భుజాలు, వీపు రెండింటికీ వ్యాపించిన కూడా అది గుండెపోటుకి సంకేతంగా చెబుతున్నారు.నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు గొంతు లేదా కింద దవడలో నొప్పి రావచ్చు. అలాగే, ఈ నొప్పి.. పంటి నొప్పి, శ్వాస ఆడకపోవడం లేదా మెడలో ఒత్తిడి వంటి సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు. బొడ్డు పైభాగంలో నొప్పి కొన్నిసార్లు గుండెపోటును సూచిస్తుందంటున్నారు నిపుణులు. గుండెపోటు లక్షణాలు వివిధ వ్యక్తులలో విభిన్నంగా వ్యక్తమవుతాయని గుర్తుంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. పై లక్షణాలను కలిగి ఉండడంతో పాటు నిరంతరంగా చెమట, మైకము, ఆందోళనతో ఇబ్బందిపడుతున్నట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.