గుండె సమస్యలున్న వారికి ఈ ఆహారాలు విషంతో సమానం.. పొరబాటున కూడా ముట్టుకోవద్దు

www.mannamweb.com


అధిక బరువు ఉండటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. లావుగా ఉన్న వారిలో శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇది వివిధ వ్యాధులకు కారణం అవుతుంది.

అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే బరువు అదుపులో ఉండాలి. బరువు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు బరువు తగ్గడం మరింత ముఖ్యం.

అధిక బరువు ఇటువంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు ఉన్న రోగులకు బరువు తగ్గడం చాలా ముఖ్యం. అయితే, గుండె సమస్యలు ఉంటే, బరువు తగ్గించే ప్రక్రియ కొంచెం మారుతుంది. ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారు దూకలేరు, ఎగరలేరు. అలాగే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. లేదంటే గుండెపోటు ముప్పు పెరుగుతుంది.

కాబట్టి మీరు గుండె జబ్బుల రోగి అయితే, సన్నబడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, గుండె రోగులకు విషంతో సమానం. కాబట్టి రోజువారీ ఆహార జాబితాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, తక్కువ GI ఆహారాలు తీసుకోవాలి. ఈ రకమైన ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

ఆహారంలో యాపిల్స్, ఆరెంజ్, లెంటిల్స్, బ్రౌకోలీ, గ్రీన్ వెజిటేబుల్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.

అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. అప్పుడు గుండె జబ్బులతో పాటు మధుమేహం, కొలెస్ట్రాల్ ముప్పు కూడా తగ్గుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, కొవ్వు ఉన్న ఆహారాలు తినడం వల్ల మళ్లీ బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది.