ప్రస్తుత కాలంలో సాధారణంగా మారిపోయిన అనారోగ్య సమస్యల్లో గుండె జబ్బులు ఒకటి. గుండె పోటుతో ఈ మధ్య కాలంలో చాలా మంది మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారు సైతం హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు.
ఈ గుండె పోటు రావడానికి ముఖ్య కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఒత్తిడి, ఆందోళన అనేది బాగా ఎక్కువైపోయాయి. స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఎఫెక్ట్ గుండె మీద పడుతుంది.
స్ట్రెస్‌ని తట్టుకోలేక చాలా మంది అక్కడికక్కడే మరణిస్తున్నారు. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ట్రై చేయాలి. చాలా మంది ఆఫీసుల్లో, ఇంట్లో ఉండే టెన్షన్ కారణంగా మద్యం సేవించడం, ధూమపానం చేస్తూ ఉంటున్నారు.
ఇవి కాస్తా గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఒత్తాడిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి.. రక్త నాళాల్లో వాపు పెరిగి.. దెబ్బతింటున్నాయి. దీంతో హార్ట్ ఎటాక్ వంటివి వస్తున్నాయి
కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. స్ట్రెస్‌ని తగ్గించుకునే టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఎక్కువగా రెస్ట్ తీసుకునేందుకు, నలుగురితో కలిసి మాట్లాడేందుకు ట్రై చేయండి.