తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) వీడడం లేదు. ఇటీవల ఏర్పడిన ఫెంగల్ తుపాను(Cyclone Fengal) ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే.
ఇక ఫెంగల్ తుపాను అనంతరం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ(Andhra Pradesh), తమిళనాడు(Tamilanadu), పుదుచ్చేరి, తెలంగాణ(Telangana)లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఏపీకి రెయిన్ అలర్ట్(Rain Alert) జారీ చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని అనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం పై అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపింది. ఇది ఈ నెల 11వ తేదీన శ్రీలంక-తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం(dry weather) నెలకొంటుందని తెలిపింది.