హీరోయిన్ సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్‌మెంట్‌

తమిళ స్టార్ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి సాయి ధన్సికతో తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గతంలో ప్రకటించాడు కూడా.


కాగా.. నేడు (శుక్రవారం ఆగస్టు 29) విశాల్‌, సాయి ధన్సిక ఎంగేజ్ జరిగింది(vishal engagement). చెన్నైలోని విశాల్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కాగా.. నేడు విశాల్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే.

కాగా.. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.