High BP Tips : నేటితరుణంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది బీపీతో బాధపడుతున్నారు. 25 నుండి 30 సంవత్సరాల వయసు వారు కూడా బీపీతో బాధపడుతున్నారు. మారిన మన జీవనవిధానం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఈ సమస్య బారిన పడితే మనం జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. మందులు వాడినప్పటికి కొందరిలో బీపీ అస్సలు నియంత్రణలోకి రాదు. బీపీ రీడింగ్ పెరిగిపోతూనే ఉంటుంది. రక్తపోటు సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు కారణంగా గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమస్యను వీలైనంత వరకు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మందులు వాడినప్పటికి బీపీ అదుపులోకి రాని వారు ఇప్పుడు చెప్పే 3 నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నియమాలను వాడడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది.
బీపీ సమస్యతో బాధపడే వారు పాటించాల్సిన నియమాల్లో మొదటిది నీటిని ఎక్కువగా తాగడం. రోజూ 4 లీటర్ల నీటిని తాగడం వల్ల బీపీకి కారణమైన ఉప్పు మూత్రం ద్వారా బయటకు పోతుంది. 4 లీటర్ల నీటిని తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న ఉప్పును మూత్రపిండాలు రోజుకు 5 గ్రాముల మోతాదులో బయటకు పంపించగలవు. ఉప్పు బయటకు వెళ్లడం వల్ల రక్తనాళాలు మృదువుగా తయారవుతాయి. రక్తం చిక్కబడడం తగ్గుతుంది. గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇక బీపీతో బాధపడే వారు పాటించాల్సిన రెండవ నియమం ఉప్పును తక్కువగా తీసుకోవడం. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది రక్తనాళాల గోడల వెంబడి పేరుకుపోయి రక్తనాళాలను గట్టిగా మారుస్తుంది. దీంతో రక్తనాళాల సంకోచ, వ్యాకోచాలు తగ్గుతాయి. దీంతో రక్తాన్నిసరఫరా చేయడానికి గుండెపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. కనుక ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా ఊరగాయలను, నిల్వ పచ్చళ్లను తీసుకోవడం తగ్గించాలి. కూరలల్లో కూడా ఉప్పును తక్కువగా వాడాలి.
ఉప్పు లేకుండా కూరలను తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇది కూడా వీలు కానీ వారు కూరలను వండేటప్పుడు కాకుండా కూరలను ప్లేట్ లో వేసుకున్న తరువాత వాటిపై కొద్దిగా సైంధవ లవణాన్ని చల్లి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. ఇక బీపీతో బాధపడే వారు పాటించాల్సిన మూడవ నియమం రోజులో ఒక్కసారి మాత్రమే ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట మొలకెత్తిన గింజలు, నట్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. సాయంత్రం సమయంలో పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా ఈ మూడు నియమాలను పాటించడం వల్ల ఎంతో కాలంగా అదుపులోకి రాకుండా వేధిస్తున్న బీపీ కూడా త్వరగా అదుపులోకి వస్తుంది. ఈ నియమాలను పాటించడం వల్ల బీపీ అదుపులోకి రావడంతో పాటు సమస్య లేని వారికి కూడా రాకుండా ఉంటుంది.