High Cholesterol: ఈ కొత్త లక్షణాలు ఉంటే మీలో కూడా చెడు కొలెస్ట్రాల్‌ విచ్చలవిడిగా పెరిగినట్లే..

www.mannamweb.com


How To Lower High Cholesterol: ఆధునిక జీవనశైలి పాటించేవారిలో ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీని కారణంగా చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

అయితే శరీరంలో చెడు కొవ్వు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ కింది సమస్యలు వస్తే తప్పకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెరినట్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే శరీరంలో ఎలాంటి లక్షణాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఈ నొప్పులు వస్తాయి:

కీళ్లు:

చాలా మందిలో కీళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

మెడ:

మెడ నొప్పులు రావడానికి ప్రధాన కారణం కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా మెడ నొప్పి రావడం వల్ల ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ఛాన్స్‌ కూడా ఉంది.

పొట్ట:

తరుచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారిలో కూడా కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశాలున్నాయి. అతిగా కొలెస్ట్రాల్‌ పెరగడం కారణంగానే గ్యాస్‌, ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

గుండె:

ప్రస్తుతం చాలా మందిలో గుండె ప్రాంతంలో నొప్పి ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగనట్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.