కొడాలి నానిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు

www.mannamweb.com


కొడాలి నానిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట దక్కింది. వాలంటీర్ల ఫిర్యాదుతో కృష్ణా జిల్లా గుడివాడలో నానిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో కొడాలి నానిని అరెస్ట్ చేయవద్దని ఇవాళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు అదేశాలు ప్రకారం 41A నోటీసులు ఇవ్వాలని పోలీసులను అదేశించింది. గుడివాడలో వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితులపై కూడా కేసులు నమోదయ్యాయి. శశిభూషణ్, గొర్ల శ్రీనుపై కేసులు నమోదు చేసినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు.

కాగా, తమను బెదిరించి రాజీనామా చేయించారంటూ మాజీ వాలంటీర్లు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై పలు సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించడంతో కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేశారు. పలు ప్రాంతాల్లో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపణలు వచ్చాయి.