కొత్తగా కారు కొనుగోలు చేసే వారు మొదటగా ఆలోచించేది ఎంత మైలేజ్ ఇస్తుందని. మరీ ముఖ్యంగా భారతీయులు మైలేజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మైలేజ్ చూసి కారు కొనుగోలు చేసే వారే చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లలో అత్యధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ మూడు కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీకి భారత్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లో కార్లు కొనుగోలు చేసే వారు ముందుగా మారుతి సుజుకి కార్లను తమ ఆప్షన్స్‌లోకి తీసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన కార్లను తీసుకురావడంలో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంటుంది. భారత మార్కెట్లోనూ ఈ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది.
అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు..
మైలేజ్ గురించి ఆలోచించే వారి తొలి ప్రాధాన్యత మారుతి సుజుకీ కార్లకు ఇస్తారు. తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఈ బ్రాండ్ సొంతం. ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకీ కంపెనీకి చెందిన అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు ఏంటి.? వాటి ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రాండ్ విటారా..
అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో మారుతి గ్రాండ్ విటారా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 27.97 కి.మీల మైలేజ్ అందిస్తుంది. ఇక సీఎన్‌జీ అయితే కేజీకి 26.6 అందిస్తుంది. ధర విషయానికొస్తే ఈ కారు బేస్ వేరియంట్ రూ. 10.99 లక్షల నుంచి అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ కారులో 1462 cc పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 75.8 kW పవర్‌ను అందిస్తుంది.
అలాగే 4,400 rpm వద్ద 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాండ్ విటారాలో ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను ఇచ్చారు. హైబ్రిడ్ మోడల్‌లో లిథియం అయాన్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 3,995 rpm వద్ద 59 kW పవర్‌ను, 0 నుండి 3,995 rpm వరకు 141 Nm టార్క్‌ను అందిస్తుంది.
మారుతి స్విఫ్ట్..
అత్యంత ప్రజాదరణ కార్లలో మారుతి స్విఫ్ట్ ఒకటి. ఈ కారులో జెడ్12E పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 5,700 rpm వద్ద 60 kW పవర్‌ను, 4,300 rpm వద్ద 111.7 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు లిటర్‌కు 24.8 కి.మీల మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రైజ్ ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మారుతి డిజైర్..
అత్యధిక మైలేజ్ అందిస్తున్న మరో కారులో డిజైర్ ఒకటి. మారుతి తీసుకొచ్చిన కొత్త డిజైర్‌లో 1.2-లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ కారు లీటర్‌కు 25.71 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మారుతి స్విఫ్ట్ CNG కిలోకు 33.73 కి.మీల మైలేజ్ ఇస్తుంది. ధర విషయానికొస్తే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య ఉంటుంది.