మీ ఇల్లు డ్యామేజ్ అయ్యిందా? ఇలా చేస్తే ఖర్చులకు డబ్బులు వస్తాయి

www.mannamweb.com


సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ప్రతి మనిషి జీవితంలో ఎక్కువగా ఖర్చయ్యేది దీనికే. కాయ కష్టం చేసి రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసి సంపాదించి కూడబెట్టిన డబ్బుతో ఇల్లు కొంటాం లేదా కట్టుకుంటాం. అలాంటి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని కారణాల వల్ల మన ఇంటికి డ్యామేజ్ జరగవచ్చు. మనం కష్టపడి ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లు కూలిపోవచ్చు. దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, ఊహించని ఇతర విపత్తులు ఎదురైన సమయంలో మన ఇల్లు డ్యామేజ్ అవ్వొచ్చు. మనం పెట్టిన ఖర్చు వృధా కావొచ్చు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా రావొచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు డబ్బులు వచ్చే మార్గం ఒకటి ఉంది. మన ఇంటిని హోం ఇన్సూరెన్స్ కాపాడుతుంది. మన ఇల్లు డ్యామేజ్ అయినప్పుడు మనకు భరోసాగా నిలుస్తుంది. ఇంతకీ ఆ ఇన్సూరెన్స్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆన్‌లైన్‌లో మనకు ‘భారత్ గృహ రక్షా పాలసీ’ అనే స్కీమ్ అందుబాటులో ఉంది. అది తీసుకుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కు వివిధ రకాల విపత్తుల నుంచి ఇన్సూరెన్స్ కవరేజీ వస్తుంది. అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం వంటి ప్రమాదాలకు ఈ పాలసీ కవరేజీని అందిస్తుంది. దీన్ని Insurance Regulatory and Development Authority of India(IRDAI) అప్రూవ్ చేసి ప్రతి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండే విధంగా చేసింది. తక్కువ ధరకే ఈ పాలసీ ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలు చాలానే ఉన్నాయి. పాలసీ బజార్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే కేవలం 800/- ప్రీమియంకే ఇన్సూరెన్స్ ఇచ్చే ఫేమస్ కంపెనీలు ఉంటాయి. వాటిలో బెస్ట్ ఏదో తెలుసుకొని ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. సొంతిల్లు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారత్ గృహ రక్ష పాలసీ తీసుకోవడం చాలా మంచిది.

మీరు పాలసీ తీసుకుంటున్న సమయంలో కంపెనీ రివ్యూస్ కూడా కచ్చితంగా చెక్ చేయండి. అది ఫేమస్ కంపెనీ అయితే పర్లేదు. చిన్న కంపెనీ అయితే దాని హిస్టరీ గురించి తెలుసుకోండి. ఈ పాలసీని తీసుకునేటప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసే ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. క్లెయిమ్‌లను సెటిల్ చేసే విషయంలో కంపెనీకి ఉన్న ట్రాక్ రికార్డ్‌ గురించి తెలుసుకోవాలి. గతంలో ఇలాంటి హోం ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ఎలా ఇచ్చారు? కస్టమర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏమిటి? కచ్చితంగా తెలుసుకోవాలి.