హోండా యాక్టివా CNG వెర్షన్ రాబోతోంది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ ప్రయాణించవచ్చు

పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్, సిఎన్‌జి వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలు సిఎన్‌జి వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఇంతలో, హోండా యాక్టివా కూడా సిఎన్‌జి స్కూటర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.


మైలేజ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని హోండా యాక్టివా సిఎన్‌జి స్కూటర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటీని తక్కువ ధరకే తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్కూటీకి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ఈ స్కూటీని ఈ ఏడాది చివరి నాటికి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో? ధర ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హోండా యాక్టివా సిఎన్‌జి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు

హోండా యాక్టివా సిఎన్‌జి అద్భుతమైన ఫీచర్లను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం..

డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్

LED హెడ్‌లైట్, LED సూచికలు

ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)

ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్

ఈ స్కూటీ ఆధునిక రూపాన్ని అందించడమే కాకుండా సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందించే లక్షణాలతో అమర్చబడి ఉంటుంది.