భారీగా తగ్గిన హోండా యాక్టివా ధరలు…కొత్త GST 2 .0 ధరలు ఎలా ఉన్నాయి అంటే

భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాలలో హోండా యాక్టివా ప్రముఖ స్థానం సంపాదించింది. మైలేజ్, పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, ఈజీ మెయింటన్స్ ఉండడంతో మార్కెట్ లో వినియోగదారుల ఆదరణ పొందింది.


2025లో ప్రభుత్వం కొత్త GST 2.0 మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గింపుతో ఆక్టివా స్కూటర్ల ధరల్లో మార్పులు చెందాయి. ఈ కొత్త GST విధానం వలన కొత్తగా స్కూటర్ కొనాలనుకునే అనుకునే వినియోగదారులకు ఆర్థిక పరంగా చాలా లాభదాయకంగా మారింది.హోండా యాక్టివా పాత రేట్లతో పోల్చితే కొత్త GST 2 .0 ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
2025 సెప్టెంబర్‌ 22 నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GST 2.0 కొత్త రేట్స్ అమలు కానున్నాయి.దీని ప్రకారం 350cc లోపు ఉన్న ద్విచక్ర వాహనాలపై GST రేటు 28% నుండి 18%కి తగ్గించబడింది.ఆ కేటగిరిలో ఉన్న హోండా ఆక్టివా స్కూటర్ల ధరలు కూడా తగ్గాయి.

హోండా యాక్టివా పాత GST ప్రకారం రేట్లు (GST 28%)
హోండా యాక్టివా 110 స్టాండర్డ్ ఎక్స్ షోరూమ్ ధర ₹81,045 రూపాయిలు
హోండా యాక్టివా 110 DLX ఎక్స్ షోరూమ్ ధర ₹91,565 రూపాయిలు
హోండా యాక్టివా 110 స్మార్ట్ ఎక్స్ షోరూమ్ ధర ₹95,567 రూపాయిలు
హోండా యాక్టివా 125 – H స్మార్ట్ ఎక్స్ షోరూమ్ ధర ₹1,00,242 రూపాయిలు
హోండా యాక్టివా 125 – DLX ఎక్స్ షోరూమ్ ధర ₹96,270 రూపాయిలు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్త GST రేట్ల అనుగుణంగా హోండా కంపెనీ కూడా 28 % నుండి 18 % ధరలు తగ్గించింది.కొత్త GST ప్రకారం హోండా యాక్టివా 110 ధరలు 7,874 వరకు తగ్గనున్నాయి.హోండా యాక్టివా 125 ధరలు 8,259 వరకు తగ్గనున్నాయి.

హోండా యాక్టివా ఫీచర్స్
ఇది 110cc &125cc పవర్ఫుల్ ఇంజిన్‌లతో వస్తుంది. ఇవి ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పాటు మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఆక్టివా యొక్క డిజైన్ క్లాసిక్,ఆకర్షణీయంగా ఉండటంతో పాటు సిటీ డ్రైవింగ్‌కు బెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఇందులో ఫుల్ LED హెడ్‌లైట్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,మంచి స్టోరేజ్ స్పేస్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ కూడా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు.ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్,బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మంచి సస్పెన్షన్ కలిగి ఉంటుంది.వేరియంట్స్ మోడల్స్ బట్టి ధరలు ఉంటాయి.కొత్త రేట్స్ కారణంగా అందరికి బడ్జెట్ పరంగా కొత్త ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు.కచ్చితమైన ధరలకు మీరు షో రూమ్ వెళ్లి చెక్ చేసుకోగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.