కింద పడినా పగలని టెక్నాలజీతో హానర్ ఫోన్! ధర ఎంతంటే..

www.mannamweb.com


హానర్ ఎక్స్9 బీ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రన్ అవుతుంది. ఇందులో హానర్ మ్యాజిక్ ఓఎస్ యూఐ ఉంటుంది.
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హువాయికి చెందిన హానర్ బ్రాండ్ నుంచి త్వరలో ఓ సరికొత్త మొబైల్ లాంఛ్ అవ్వనుంది. ఇందులో ‘అల్ట్రా బౌన్స్ బ్యాక్ డిస్‌ప్లే’ అనే ప్రత్యేక ఫీచర్‌‌తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే.. హానర్ నుంచి ‘హానర్ ఎక్స్9 బీ’ అనే స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది. ఫిబ్రవరి 15వ తేదీన స్మార్ట్ ఫోన్ లాంఛ్ అవ్వనున్నట్టు హానర్‌టెక్ అఫీషియల్ ఎక్స్(ట్విటర్) పేజీ ప్రకటించింది. అయితే ఇందులో సరికొత్త అల్ట్రా బౌన్స్ డిస్‌ప్లేను వాడారట. అంటే ఫోన్ ఏ యాంగిల్‌లో కింద పడినా డిస్‌ప్లేకు ఎలాంటి హాని జరగదన్న మాట.
హానర్ ఎక్స్9 బీ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రన్ అవుతుంది. ఇందులో హానర్ మ్యాజిక్ ఓఎస్ యూఐ ఉంటుంది. డిస్‌ప్లే విషయానికొస్తే 6.78 అంగుళాల 1.5కే అమోలెడ్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో వెనుకవైపు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇందులో 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. అయితే బాక్స్‌లో ఛార్జర్ ఉండకపోవచ్చు. హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్.. 8జీబీ/12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో రానుంది. 5జీ సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో ఇయర్ ఫోన్స్ అందిస్తున్నారు. అలాగే 12 నెలల స్క్రీన్, బ్యాక్ కవర్ ప్రొటెక్షన్, 24 నెలల వారంటీ కూడా ఉంది. రెండు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉండొచ్చు.