ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా నీరు తాగాల్సిందే. నీరు తాగితే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే, ఏ నీరు తాగాలనేది తెలుసుకోవాలి. కొంతమందికి చల్లని నీరు తాగాలంటే ఇష్టం. కానీ, చల్లని నీరు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా, ఫ్రిజ్ వాటర్ ఆరోగ్యానికి హానికరమనే చెప్పొచ్చు. అందుకే, గోరువెచ్చని నీరు లేదా వేడి నీటిని తీసుకోవాలి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. జీవక్రియని మెరుగుపరుస్తుంది.
వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతాయి. కేవలం వేడి నీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇందులో నిజమెంతో తెలుసుకోండి.
రక్తంలో చక్కెరస్థాయిలు..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. దీని వల్ల జీర్ణక్రియ సమస్యలు, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటిని తగ్గించేందుకు రోజంతా 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం మంచిది.
వేడి నీటితో లాభాలు..
వేడి నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ వేడినీరు తాగితే జీవక్రియలు మెరుగ్గా మారతాయి. జీర్ణవ్యవస్థ సరిగా మారుతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో వేడినీరు తాగడం చాలా మంచిది. బాడీ హైడ్రేట్‌గా ఉంచేందుకు వేడి నీరు తాగండి. అంతేకాకుండా, బరువు తగ్గాలనుకునేవారు కూడా వేడి నీటిని తాగితే మంచిది.
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా..
వేడినీటిని తాగితే మొత్తం ఆరోగ్యానికి మంచిది. కానీ, షుగర్ ఉన్నవారికి వేడినీరు తాగితేనే బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయని ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ, ఇది రక్తంలో చక్కెర స్థాయిలని బ్యాలెన్స్ చేయడంలో సాయపడుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా నీరు తాగితే బాడీలో విషపదార్థాలు విడుదలవుతాయి. దీని కారణంగా రక్తంలోని అదనపు చక్కెర మూత్రం ద్వారా తొలగించబడుతుంది. వేడి మాత్రమే కాదు.. సాధారణ నీరు కూడా చాలా మేలు చేస్తుంది. అలాంటప్పుడు, కనీసం మూడు లీటర్ల నీరు తాగడానికి మంచిది.
నీరు తాగడానికి సరైన మార్గం..
సరైన సమయంలో.. సరైన విధంగా, నీరు తాగితే మంచి లాభాలు ఉన్నాయి. మరిన్ని ప్రయోజనాల కోసం.. ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగండి. ఇలా తాగితే బాడీలో టాక్సిన్స్ చాలా తేలిగ్గా రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత భోజనానికి 30 నిమిషాల ముందు నీరు తాగండి.. బయటికి వెళ్ళినా కూడా నీటిని మర్చిపోకుండా నీటిని తాగండి. అదే విధంగా, నిల్చొని నీరు తాగొద్దు. కూర్చుని మాత్రమే నీరు తాగండి. గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు