ఏపీలో నిరుపేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు.. సీఎం చంద్రబాబు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలకు చంద్రబాబుతో మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో నిరుపేదల ఇళ్ల నిర్మాణ పనులలో వేగం పెంచి, దసరాకు గృహప్రవేశాలు చేయాలని సంకల్పించిన చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసింది.


ఇక తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఇల్లు కనీసం భూమి కూడా లేని నిరుపేదలకు సంబంధించి శుభవార్త చెప్పారు.

ఇళ్ళ స్థలాల పట్టాలు ఇవ్వటానికి చంద్రబాబు ఆదేశం

అర్బన్‌, రూరల్ ఏరియాల్లో సెంట్‌ భూమి కేటాయింపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అర్బన్‌ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్‌ ప్రాంతంలో 3 సెంట్లు భూమి నిరుపేదలకు కేటాయించాలని ఆయన సూచించారు. అర్బన్‌ ఏరియాలో భూ లభ్యత లేకపోతే.. గ్రూప్‌ హౌసింగ్‌పై దృష్టి పెట్టాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వారికి కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు

ఎక్కడైనా భూమి ఇస్తుంటే, సెంట్‌ పట్టా తీసుకోడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపకపోతే ఆ భూమి పరిశ్రమలకు కేటాయించాలని చంద్రబాబు అన్నారు. సెంట్‌ పట్టా తీసుకోడానికి ఆసక్తి చూపని వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు ఇవ్వాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇల్లు లేని నిరుపేదల కోసం ఏపీ ప్రభుత్వ చర్యలు

ఇక ఇప్పటికే దసరా కానుకగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు చేయిస్తుంది. సొంతిల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఏపీ ప్రభుత్వం సహాయం చేస్తోంది. ప్రభుత్వం ఎస్సీ, బిసి వర్గాలకు 50 వేల రూపాయలు, ఎస్టీ వర్గానికి 75 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసి, వీరి ఇళ్ళ నిర్మాణాలకు అండగా నిలుస్తోంది.

గృహ నిర్మాణాలకు మద్దతునిస్తున్న చంద్రబాబు సర్కార్

అంతేకాదు ఏపీలో అమలవుతున్న ఈ గృహనిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 తో అనుసంధానం చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయల వరకు గృహ నిర్మాణానికి మద్దతు లభిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు 3లక్షల గృహప్రవేశాలు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించేలా కసరత్తు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం.

ఇళ్ళ స్థలాల పట్టాల విషయంలో కీలక నిర్ణయం

వచ్చే మార్చికల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది.ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు కనీసం ఇళ్ల స్థలాలు కూడా లేని నిరుపేదలకు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు, రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు భూమిని కేటాయించాలని, వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు. త్వరలోనే లబ్ధిదారులకు ఈ భూములను అందించాలని ఆదేశించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.