ఇంటర్నెట్ మొదట మీ ఇంటికి లేదా ఆఫీస్‌కు బ్రాడ్‌బ్యాండ్ లైన్ లేదా మొబైల్ నెట్‌వర్క్ ద్వారా వస్తుంది. Wi-Fi రౌటర్ ఈ డిజిటల్ డేటాను రేడియో సిగ్నల్స్‌గా మారుస్తుంది.
నేటి డిజిటల్ వరల్డ్‌లో ఇంటర్నెట్ కూడా ఎలక్ట్రిసిటీలా మారింది. నెట్ లేకపోతే క్షణం కూడా ఉండలేని పరిస్థితులు వచ్చేశాయి. ఇంట్లో అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం వెనక Wi-Fi టెక్నాలజీ కీలకంగా పని చేస్తుంది. Wi-Fi లేకపోయి ఉంటే ప్రతి డివైజ్‌ని వైర్‌తో కనెక్ట్ చేయాల్సి వచ్చేది. దీంతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, స్మార్ట్ టీవీల వినియోగం కష్టంగా మారేది. ఇంత కీలకమైన వైఫై ఎలా పని చేస్తుందో తెలుసా?
Wi-Fi అంటే ఏంటి?Wi-Fi అంటే వైర్‌లెస్ ఫిడిలిటీ (Wireless Fidelity). ఇది గాలిలో రేడియో వేవ్స్ ద్వారా డేటాను పంపుతుంది, స్వీకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది రేడియో స్టేషన్‌లా పని చేస్తుంది. ధ్వని తరంగాలు మీ రేడియోను చేరుకోవడానికి గాలిలో ప్రయాణించినట్లే, Wi-Fi సిగ్నల్స్ కూడా రౌటర్ నుంచి మీ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ టీవీకి గాలిలో ప్రయాణిస్తాయి. ఈ ప్రాసెస్ సెకను కంటే చాలా తక్కువ టైమ్‌లో జరుగుతుంది. వేగంగా బ్రౌజ్ చేస్తున్నప్పుడు, స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు లేదా వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పటికీ డిలేని నోటీస్ చేయలేరు.
Wi-Fi ఎలా పనిచేస్తుంది?ఇంటర్నెట్ మొదట మీ ఇంటికి లేదా ఆఫీస్‌కు బ్రాడ్‌బ్యాండ్ లైన్ లేదా మొబైల్ నెట్‌వర్క్ ద్వారా వస్తుంది. Wi-Fi రౌటర్ ఈ డిజిటల్ డేటాను రేడియో సిగ్నల్స్‌గా మారుస్తుంది. మీ డివైజ్ Wi-Fi రిసీవర్ ఈ సిగ్నల్స్‌ని క్యాప్చర్ చేస్తుంది. డివైజ్ ఈ రేడియో సిగ్నల్స్‌ను డిజిటల్ డేటాగా మారుస్తుంది.
Wi-Fi సిగ్నల్స్ రకాలుWi-Fi ప్రధానంగా రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లపై పనిచేస్తుంది. 2.4 GHz బ్యాండ్ – పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుంది కానీ తక్కువ వేగంతో ఉంటుంది. 5 GHz బ్యాండ్ – ఎక్కువ డేటా స్పీడ్ అందిస్తుంది కానీ తక్కువ దూరంలో మెరుగ్గా పనిచేస్తుంది. Wi-Fi 6, Wi-Fi 7 వంటి కొత్త టెక్నాలజీలు ఫాస్ట్, రిలైబుల్ కనెక్షన్స్ అందిస్తాయి.
వైఫై సెక్యూర్‌గా ఉండాలంటే ఎలా?ఎక్కడి నుంచైనా నెట్‌వర్క్‌ని మేనేజ్ చేయడానికి రిమోట్ యాక్సెస్ ఫీచర్ ఉంటుంది. అయితే దీనికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రిమోట్ యాక్సెస్ అవసరం లేకుంటే, హ్యాకర్లు హోమ్ నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయకుండా చెక్ పెట్టడానికి ఈ ఫీచర్‌ని డిజేబుల్ చేయండి.
అలానే మ్యానుఫ్యాక్చర్ వెబ్‌సైట్‌లో ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ కోసం చెక్ చేయండి. రూటర్‌లో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లు, ఫీచర్లు ఉండేలా లేటెస్ట్ ఫర్మ్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు వైఫై నెట్‌వర్క్ ఆపేయండి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నెట్‌వర్క్‌ను అనాథరైజ్డ్‌గా ఎవరూ యాక్సెస్ చేయలేరు.
అన్‌వాంటెడ్ ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ నెట్‌వర్క్ ట్రాఫిక్‌కు చెక్ పెట్టడానికి రూటర్‌లో ఫైర్‌వాల్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయండి. రూటర్ సెట్టింగ్స్‌ను యాక్సెస్ చేయండి, అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో ఫైర్‌వాల్ టోగుల్‌ను ఎనేబుల్ చేయండి. వ్యక్తిగతంగా తెలియని వ్యక్తులకు హోమ్ వైఫై నెట్‌వర్క్‌కు యాక్సెస్ ఇవ్వకండి. రూటర్ ప్రొవైడ్ చేసిన డిఫాల్ట్ నెట్‌వర్క్ నేమ్(SSID), పాస్‌వర్డ్‌ను యూజ్ చేయకండి. అనాథరైజ్డ్ యూజర్స్ నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయకుండా నెట్‌వర్క్ నేమ్, పాస్‌వర్డ్‌ను యూనిక్‌గా, స్ట్రాంగ్‌గా సెట్ చేయండి.
































