అధిక రక్తపోటు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అనేక మంది ఎదుర్కొంటున్న సమస్య. పెరుగుతున్న ఒత్తిళ్లు.. మారుతున్న జీవన శైలి బీపీ బాధితులుగా మార్చేస్తున్నాయి.
బీపీ సమస్య తో బాధ పడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. బీపీ నిర్దేశిత లిమిట్ దాటితే ముప్పు తప్పదు. బీపీ పెరిగితే గుండె, మూత్ర పిండాలు, మెదడు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, బీపీ ఏ మేర పెరిగితే గుండె పోటు వస్తుంది.. ఆ లక్షణాలు ఎలా ఉంటాయనేది నిపుణులు వివరిస్తున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలని.. ప్రతీ నిమిషం కీలకమని సూచిస్తున్నారు.
రక్తపోటు పెరిగితే గుండె పోటు ముప్పు తప్పదు. బీపీ పెరిగిన సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అన్ని అవయవాల పైన ఒత్తిడి పెరుగుతుంది. గుండె పోటుకు ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటు ఒకటి. బీపీ పెరిగినప్పుడు హార్ట్ ఎటాక్ ముప్పు కూడా అదే స్థాయి లో పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోటు లకు ప్రధాన కారణం రక్తపోటుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. రక్తపోటు సమస్యను సరిగ్గా నియంత్రిం చకపోతే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. రక్తపోటు 180/120 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మరింతగా పెరిగితే గుండెపోటు వచ్చే అవకా శాలు పెరుగుతాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. లేదంటే..గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
హై బీపీ ఉన్నవారు ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. తరచుగా హెల్త్ చెక్-అప్ చేయించుకోవడం ఉత్తమం. రక్తపోటు పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన మందులు తీసుకోవాలని. ఏ సందర్భంలోనూ మందులు వాడటం ఆపకూడదు. కాగా, సిస్టోలిక్ ఒత్తిడి 139కి డయాస్టోలిక్ రీడింగ్ 89కి చేరిందంటే ప్రీ హైపర్ టెన్షన్‌గా భావించాలి. సిస్టో లిక్ బీపీ 140-159 మధ్య, డయాస్టోలిక్ బీపీ 90-99 మధ్య ఉంటే మొదటి దశ హైపర్ టెన్షన్ గా, 160/100 లేదా ఆపైన ఉంటే రెండో దశ హైపర్ టెన్షన్‌గా భావిస్తారు. కానీ నిర్దేశిత స్థాయిని దాటుతోందంటే హార్ట్ ఎటాక్ ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక బీపీ ఉన్న వాళ్లు ఛాతిలో నొప్పి.. మండుతున్నట్టు ఉండటం, వీపులో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రెండు చేతుల్లో నొప్పులు, అతిగా చెమటలు పట్టడం, కడుపులో తిప్పినట్టు ఉండటం వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో.. బీపీ నియంత్రణలో ఉంచుకుంటే సమస్యలు దూరంగా ఉంటాయి.
































