శవాసనంతో ఎన్ని లాభాలో..​! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ తెలిస్తే.. ఇప్పుడే మొదలుపెడతారు..

www.mannamweb.com


యోగాసనాల్లో శవాసనం చేయడం చాలా సులభం. ఇది చాలా మందికి ఇష్టమైన ఆసనం కూడా. ఎందుకంటే ఈ ఆసనం వేయడానికి శరీరాన్ని వంచాల్సిన అవసరం లేదు. దీనికి శవంలా పడుకుంటే చాలు.

శవాసనం చేస్తున్నప్పుడు పడుకుని మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయాలి. మీరు మీ కళ్ళు మూసుకుని ఈ ఆసనం వేసేటప్పుడు మనస్సు శరీరంలోని ప్రతి భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వాలి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. ఉద్రిక్తత స్థాయి కూడా తక్కువ అవుతుంది.

శవాసనాన్ని శాంతి ఆసనం, అమృతాసనం అని కూడా పిలుస్తారు. శతాబ్దాలుగా మెదడులోని శక్తిని ఉత్తేజితం చేసేందుకు ఎంతో మంది యోగా గురువులు చెబుతున్న చేస్తున్న ఆసనమిది. ప్రధానంగా ఇది మెదడుపై ఒత్తిడిని తొలగించి ప్రశాతంతనిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శవాసనం చేయడం వల్ల నిద్రలేమికి సహాయపడుతుంది. మీరు రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పొందాలంటే, ఈ యోగాభ్యాసం చేయడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.

శవాసనంలో శరీరంలో కదలికలను నియంత్రిస్తూ శవం మాదిరిగా నిశ్చలంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే శ్వాస మీదనే ధ్యాస ఉంచడం సాధ్యమవుతుంది. అలా శారీరకంగా, మానసికంగా విశ్రాంతి దొరుకుతుంది. శరీరం ఈ స్థితిలో ఉన్నప్పుడు కార్డిసాల్ స్థాయిలు తగ్గుతాయి. హృదయ స్పందన, రక్తపోటు తగ్గుతాయి. అలా మైండ్‌ను రీసెట్ చేయడానికి సహకరిస్తుంది.

వ్యాయామం, వాకింగ్, యోగా అనంతరం శవాసనం ద్వారా శరీరానికి విశ్రాంతితో పాటు.. శవాసనాలో ధ్యానం చేయడం వల్ల వ్యాయామం తర్వాత శరీర అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఇలా చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

శవాసనాన్ని క్రమం తప్పకుండా వేస్తుండటం వల్ల మెదడు నిర్మాణంలో మార్పులు కలుగుతాయి. కొత్త కొత్త విషయాలను నేర్చుకునేందుకు కావాల్సిన ఏకాగ్రతతో పాటు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఈ ఆసనాన్ని అలవాటుగా చేసే వారు కొంత కాలం తర్వాత క్రియేటివ్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉండగలుగుతారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ ఆసనంతో కలిగే మరో లాభమేంటంటే ఒత్తిడి లేకుండా పనిచేయడం వల్ల చక్కగా నిద్ర పోగలుగుతాం.