భారతీయ నిపుణులు చాలామంది, ముఖ్యంగా టెక్ పరిశ్రమలో సర్వీసులు అందిస్తున్నారు. అమెరికాలో పనిచేయాలని కలలు కంటారు. అందుకు ప్రధాన కారణం అక్కడ వేతనాలు ఎక్కువగా ఉంటాయి.
లైఫ్‌స్టైల్ మెరుగ్గా ఉంటుందనే భావన ఉంది. ఇది నిజమే అయినా అక్కడా కట్టాల్సిన ట్యాక్స్‌లు, అవసరాలకు చేయాల్సిన ఖర్చులు చాలానే ఉంటాయి. అసలు అమెరికా, ఇండియాలో ఏడాదికి సుమారు కోటి రూపాయల వరకు సంపాదించే ఇద్దరు వ్యక్తులకు ఎంత మిగులుతుందనే అనుమానాలు చాలా మందిలోనే ఉంటాయి. దానికి సంబంధించిన విషయాలు కింద తెలుసుకుందాం.
అమెరికాలో ఉద్యోగాలు, వేతనాలు
ఎంఎస్ గ్రాడ్యుయేట్లు & సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు జీతాలు(నైపుణ్యాలకు అనుగుణంగా వేతనాలు మారుతుంటాయని గమనించాలి)
బేస్ జీతం: ఏటా 1,00,000 డాలర్లు – 1,40,000 డాలర్లు
బోనస్ + స్టాక్ ఆప్షన్లు: తరచుగా 10,000 డాలర్లు – 30,000 డాలర్లు అదనం.
దాంతో ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఏటా సుమారు రూ.83 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు ఉంటుంది. ఇది చాలా పెద్ద అమౌంట్‌గా తోస్తుంది. అయితే ఇందులో కొన్ని కటింగ్స్ ఉంటాయి.
అమెరికాలో పన్నులు ఇలా..
ఏడాదికి 1,20,000 డాలర్ల జీతం వస్తుందనుకుంటే..
స్థూల జీతం నెలవారీగా: 10,000 డాలర్లు
ఫెడరల్ + స్టేట్ ట్యాక్స్(కటింగ్స్): 2,500 నుంచి -3,000 డాలర్లు
సోషల్ సెక్యూరిటీ & మెడికేర్(కటింగ్స్): 750 డాలర్లు
నెట్ టేక్ హోమ్ పే: 6,200 – 6,500 డాలర్లు
అంటే నెలకు భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.5.1 లక్షలు మిగులుతుంది. అదే భారత్‌లో సంవత్సరానికి రూ.80 లక్షలు (పన్నుకు ముందు నెలకు సుమారు రూ.6.5 లక్షలు) అందించే భారతీయ ఉద్యోగంతో దీన్ని పోల్చుదాం. ఇక్కడ పన్ను నిర్మాణం, తగ్గింపులను బట్టి టేక్-హోమ్ నెలకు సుమారు రూ.4.5-రూ.5 లక్షలు ఉండవచ్చు.
యూఎస్, ఇండియాలో నెలవారీ ఖర్చులు ఇలా..
యూఎస్, ఇండియాలోని ఇద్దరు ప్రొఫెషనల్స్ వేతనాలు పోల్చినప్పుడు
యూఎస్‌కు వెళ్లడం కేవలం ఒక డబ్బు సంపాదనకే కాకుండా చాలామంది గ్లోబల్ వర్క్ కల్చర్ కోసం వెళ్తుంటారని గమనించాలి. కొందరు కెరీర్ ఎదుగుదల కోసం కూడా అమెరికా బాట పడుతుంటారు.
































