కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ స్కీం కింద దేశంలోని అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లోనూ లబ్ధిదారులు క్యాష్ లెస్ చికిత్స పొందే అవకాశం లభిస్తుంది. . ఆయుష్మాన్ భారత్ కార్డు పొందడానికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డు పొందటందుకు అవసరమైన అర్హతలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ కార్డుకు ఎవరు అర్హులుఆయుష్మాన్ భారత్ కార్డు ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కింద జారీ చేస్తారు. ఈ స్కీం కింద సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు కవర్ చేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులు అందరూ సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని పొందేందుకు అర్హులు. గ్రామీణ, పట్టణ కుటుంబాలు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. భారతదేశంలోని అన్ని ఎంప్యానెల్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో క్యాష్ లెస్ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు అదనంగా టాప్-అప్ కవర్ పొందేందుకు అర్హులు.ఆయుష్మాన్ కార్డు కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే..ఆయుష్మాన్ భారత్ కోసం మీకు అవసరమైన డాక్యుమెంట్ ఆధార్ నెంబర్ అని చెప్పవచ్చు. ఆయుష్మాన్ కార్డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ Step by Step Guide మీ కోసం.>> ముందుగా PMJAY వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. >> టాప్ మెనూలో Am I Eligible అని ఉన్న బటన్ క్లిక్ చేయండి. >> ఇప్పుడు ఇందులో ఉన్న ఒక క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి లాగిన్ బటన్ నొక్కాల్సి ఉంటుంది>> అనంతరం సంబంధిత వివరాలను మీరు నమోదు చేయాలి ఇందులో రాష్ట్రం, జిల్లా వంటి వివరాలు ఉంటాయి. . అనంతరం ఓకే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. >> Do e-KYC బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. >> ఇప్పుడు ఇందులో Aadhaar OTP అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ కనిపిస్తే దాన్ని వెరిఫై అని క్లిక్ చేయాల్సి ఉంటుంది>> ఇప్పుడు మీ ఆధార్ ఓటిపి ఆప్షన్ ద్వారా మీ మొబైల్ ఫోన్ ఓటిపి లభిస్తుంది. మీ ఎదురుగా ఉన్న ఖాళీలో ఓటీపీని నమోదు చేసి ఒకే కొట్టాలి. >> 15 నుంచి 20 నిమిషాల తర్వాత మీరు మరోసారి లాగిన్ అయ్యి చూసినట్లయితే డౌన్లోడ్ కార్డు బటన్ కనిపిస్తుంది . దీనిని క్లిక్ చేయడం ద్వారా మీ ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు.
































