గూగుల్ పే హిస్టరీ ఎలా డిలీట్‌ చేయాలి.? ఈ సింపుల్ స్టెప్స్‌ ఫాలో అయితే సరి

www.mannamweb.com


ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. టీ కొట్టు మొదలు, పెద్ద పెద్ద దుకాణాల వరకు డిజిట్‌ చెల్లింపులను తీసుకుంటున్నాయి.

ఇక ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్‌ ఉపయోగిస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. మార్కెట్లో డిజిటల్‌ చెల్లింపు సేవలు భారీగా అందుబాటులోకి వచ్చాయి. అయితే యాప్స్‌లో చేసే ప్రతీ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి హిస్టరీలో కనిపిస్తాయనే విషయం తెలిసిందే.

అయితే హిస్టరీలో కొన్ని ఎంపిక చేసిన లావాదేవీలను డిలీట్ చేయాలనుకుంటే పరిస్థితి ఏంటి.? ఇతరులు ఆ ట్రాన్సాక్షన్‌ను చూడకుండా చేసుకునేందుకు కూడా ఒక ఆప్షన్ అందుబాటలో ఉంది. గూగుల్‌పే యాప్‌లో ఇలా ట్రాన్సాక్షన్స్‌ను డిలీట్‌ చేయడానికి ఎలాంటి స్టెప్స్‌ ఫాలో కావాలో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విధానంలో మీరు డిలీట్‌ చేయాలనుకుంటున్న సింగిల్‌ ట్రాన్సాక్షన్స్‌ను కూడా సెలక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు.

ఇందుకోసం ముందుగా ఫోన్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం ప్రొఫైల్‌ ఆప్షన్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ’పై క్లిక్‌ చేయాలి. తర్వాత ‘డేటా అండ్‌ పర్సనలైజేషన్‌’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని గూగుల్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేయాలి. ఇక తర్వాత ‘మేనేజ్‌ యూవర్‌ గూగుల్ పే ఎక్స్‌పీరియర్స్‌’ పేజీ కిందకు స్క్రోల్‌ చేస్తే మీరు గూగుల్‌ పే ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్‌ హిస్టరీ కనిపిస్తుంది. ఈ లిస్ట్‌లో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ట్రాన్సాక్షన్స్‌ను సెలక్ట్‌ చేసుకొని డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే టైమ్‌ ఫ్రేమ్‌ను సెలక్ట్ చేసుకొని మొత్తం డేటాను కూడా మొత్తాన్నీ తొలగించొచ్చు. అలాగే హిస్టరీ మొత్తాన్ని డిలీట్‌ చేయొచ్చు.