50రూపాయలతో 30 లక్షల సంపాదించడం ఎలా? ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌ గురించి తెలుసా

రూరల్ ఏరియాలో నివసించే ప్రజల భవిష్యత్తుకు భద్రత కల్పించాలన్న లక్ష్యంతో గ్రామ్ సురక్ష యోజన స్కీమును ప్రారంభించారు. ఈ స్కీము ద్వారా చిన్న మొత్తాల పెట్టుబడితో మంచి రాబడిని పొంది..రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.


ఈ స్కీములో చేరిన సభ్యులు నెలకు రూ. 50 నుంచి రూ. 150 వరకు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం వారి వయస్సు, పదవీ విరమణ వయస్సును బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు 25ఏళ్ల వ్యక్తికి 60ఏళ్ల వయస్సులో రూ. 2,00, 000 బీమా హామీ కావాలంటే నెలకు రూ. 400-రూ. 450 వరకు చెల్లించాలి.

ఈ స్కీములో చేరే సమయంలో సభ్యులు తమ రిటైర్మెంట్ వయస్సు 55 నుంచి 60ళఏళ్ల మధ్య ఉండాలి. నిర్ణీత వయస్సు వచ్చిన తర్వాత వారికి స్థిరమైన నెలవారీ పెన్షన్ అందిస్తుంది.

ఈ స్కీమ్ కింద కనీసం రూ. 10, 000నుంచి రూ. 10లక్షల వరకు బీమా మొత్తం అందుతుంది. ఈ స్కీము ముఖ్య లక్షలణం ఏంటంటే పాలసీదారుడు తమ జీవితాంతం పెన్షన్ పొందుతారు.

ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే నామినీకి మొత్తం బీమా మొత్తం చెల్లిస్తారు. ఇదొక రకంగా జీవిత బీమా స్కీంగా పనిచేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా రూ. 35లక్షల వరకు మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.