చాలా మందికి బల్లులంటే భయం. గోడలపై పాకుతూ ఇళ్లంతా తిరిగే బల్లిని చూస్తే కొందరు నిద్రకూడా పోరు. వాటి ఉనికి చాలా మందికి అసహ్యం కలిగిస్తుంది. ఎక్కడ్నుంచో వచ్చి ఇళ్లల్లో దూరిన బల్లులు ఇబ్బంది పెడుతుంటాయి.
ఇవి చూడటానికి చాలా చిరాగ్గా ఉంటాయి. అంతేకాదు.. ఈ బల్లి కూడా విషపూరితమైనది కూడా. పొరపాటున బల్లి రుచి చూసినా, లేదంటే బల్లి పడిన ఆహారం ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా వంటింట్లో స్టవ్ కింద లేదా గోడల మీద ఇలాగ ప్రతి చోట బల్లులు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ బల్లిని త్వరగా వదిలించుకోండి.
బల్లులు అసహ్యకరమైన జీవి మాత్రమే కాదు. అవి చాలా విషపూరితమైనవి కూడా. అలాంటి బల్లిని తరిమికొట్టేందుకు నెమలి ఈకలను ఉపయోగించవచ్చు. నెమలి ఈకలను చూడగానే బల్లులు పారిపోతాయి. కాబట్టి బల్లులను వదిలించుకోవడానికి ఇంట్లో అక్కడక్కడ గోడపై నెమలి ఈకలను ఉంచవచ్చు. నిజానికి, నెమళ్ళు బల్లులను తింటాయి. కాబట్టి బల్లులు నెమలి ఈకలను వాసన చూసినప్పుడు అవి పారిపోతాయి. ఇకపై ఆ ప్రదేశానికి రాదు. మీ ఇంటికి బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నెమలి ఈకలను ఉంచండి. ఇల్లు అందంగా కనిపిస్తుంది, బల్లులు కూడా పారిపోతాయి.
బల్లులను వదిలించుకోవడానికి గుడ్డు పెంకులు కూడా ఉపయోగించవచ్చు. ఆమ్లెట్ తయారు చేసేటప్పుడు, గుడ్డుకు ఒక వైపున చిన్న రంధ్రం చేసి అందులని గుడ్డు సొనను బయటకు తీయండి. ఇంట్లో బల్లులు పదే పదే వచ్చే అన్ని ప్రదేశాలలో ఆ పెంకు ఉంచండి. అలాగే, మొక్కల చుట్టూ బల్లులు ఎక్కువగా ఉంటాయి. దీనికి కోడి గుడ్డు పెంకు ఆ మొక్కల దగ్గర పెట్టి ఉంచాలి. దీనివల్ల బల్లులు ఆ దగ్గరకు రావు
మీ గది చుట్టూ, ప్రతి డ్రాయర్‌లో అల్మారాలో లేదా మూలలో కొన్ని నాఫ్తలీన్ ఉండలను వేయండి. ఈ నాఫ్తలీన్ బాల్స్ బలమైన వాసనను బల్లులు తట్టుకోలేవు. దాంతో దెబ్బకు అవి పారిపోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఈ నాఫ్తలీన్ బాల్స్‌తో ఇళ్లంతా మంచి సువాసన కూడా ఉంటుంది.
మీరు బల్లులను తరిమికొట్టేందుకు కాఫీ పౌడర్‌ను కూడా వాడొచ్చు. బల్లులు కాఫీ వాసనను తట్టుకోలేవు. కాఫీ, పొగాకు కలపండి. కొద్దిగా నీటితో చిన్న బాల్స్ చేయండి. ఆబాల్స్‌ని గది మూలలో ఉంచండి. బల్లి పారిపోవటం మీరు గమనిస్తారు.
అలాగే, పెప్పర్ స్పెతో కూడా బల్లుల్ని తరిమి కొట్టొచ్చు. ఒక స్ప్రే బాటిల్‌లో నీళ్లు పోసి అందులో మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బల్లులు వచ్చే ప్రదేశాలలో పిచికారీ చేయండి. కొన్ని రోజుల తర్వాత బల్లి మళ్లీ రాదు.
ఉల్లి, వెల్లుల్లి వాసన ఎంత బలంగా ఉంటుందంటే దాని వాసన చూసిన బల్లులు ఆ ప్రాంతానికి రావు. బల్లులు తరచుగా కనిపించే ప్రదేశాలలో తరిగిన ఉల్లిపాయ లేదా వెల్లుల్లి రెబ్బలను వేలాడదీయండి. దీని ఘాటైన వాసన బల్లులు ఇంట్లోకి రాకుండా చేస్తుంది.