Replace Mattress: మనిషి రోజు మొత్తం పనిచేసి అలిసిపోయి ఇంటికి వస్తాడు. ఇలాంటి సమయంలో మంచి నిద్ర మాత్రమే అతడి బాడీని రీఛార్జ్ చేస్తుంది. ఒకవేళ నిద్ర సరిగ్గా లేకుంటే మళ్లీ మరునాడు అతడు పనిచేయలేడు.
అందుకే ఇంట్లో పడుకునే బెడ్, దానిపై ఉండే పరుపు సరిగ్గా ఉండాలి. లేదంటే నిద్రభంగం జరుగుతుంది. భారతదేశంలో చాలామంది పరుపులను ఏళ్ల తరబడి వాడుతుంటారు. దీనివల్ల నడుం నొప్పి, వెన్ను నొప్పి లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి రావొద్దంటే పరుపును సకాలంలో మార్చడం అవసరం. అయితే పరుపు దెబ్బతిందని ఎలా తెలుస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.
పరుపులు పాడైపోయినప్పుడు కొన్ని సంకేతాలు ఇస్తాయి. ముందుగా వాటినుంచి చెడువాసన వస్తుంది. ఇలాంటి సమయంలో దానిని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించండి. కొన్నిసార్లు నిద్రలేకపోవడం లేదా పరుపు మొత్తం గుంటలు పడడం అది చెడిపోయిందనడానిక అర్థం. రోజంతా అలసిపోయిన తర్వాత మీకు నిద్ర రాకపోతే వెంటనే పరుపులు మార్చండి.
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే వెన్ను లేదా నడుము నొప్పి ఉంటే వెంటనే పరుపు కారణమని గుర్తించండి. వెంటనే కొత్తది తెప్పించుకోండి. మనం లేటెస్ట్ ఫోన్‌ని డిమాండ్ చేసినట్లే బెడ్‌పై ఉన్న పరుపుల విషయంలోనూ అలాగే ఉండాలి. నేటికీ భారతదేశంలో ప్రజలు పాత పరుపుపై సంవత్సరాల తరబడి పడుకుంటారు. నిజానికి వాటిని తరచూ మారుస్తూ ఉండాలి.
పరుపును ఎక్కువ రోజులు ఉపయోగించాలంటే ముందుగా దాని కవర్‌ను కొనుగోలు చేయండి. దీని కారణంగా ఇది త్వరగా చెడిపోదు. ఇది కాకుండా ప్రతిరోజూ పరుపును తిప్పి వేసుకోండి. పరుపుకు ఒకే వైపు ఎక్కువ రోజులు పడుకుంటే అది దెబ్బతింటుంది. బెడ్ షీట్లు, కుషన్ల మాదిరిగా మురికి బ్యాక్టీరియా పరుపులో స్థిరపడుతుంది. దానిని తొలగించడానికి పరుపు, బొంతలను 15 రోజులకు ఒకసారి ఎండలో వేయాలి.