మీ LPG కనెక్షన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయింది. ఈ ప్రక్రియను మీరు ఇంటి నుంచే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం మేము స్టెప్ బై స్టెప్ గైడ్ అందిస్తున్నాము.
మీ LPG కనెక్షన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయింది. ఈ ప్రక్రియను మీరు ఇంటి నుంచే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం మేము స్టెప్ బై స్టెప్ గైడ్ అందిస్తున్నాము.
ఇంకా లింక్ చేయలేదా? అయితే నష్టపోతారు!
మీరు ఇప్పటికీ LPG కనెక్షన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయకపోతే, ప్రభుత్వం అందించే పలు రకాల ప్రయోజనాల నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల సేవల సామర్థ్యం పెరగడమే కాకుండా మోసాలు నివారించవచ్చునని సూచిస్తోంది. ఇది టైమ్‌కు డెలివరీ కావడం, సబ్సిడీ నేరుగా పొందడం వంటి ప్రయోజనాలకూ దోహదం చేస్తుంది.
లింక్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది?
ప్రజల అనుభవాన్ని మరింత సురక్షితంగా, సులభంగా చేయడం కోసం ఇది తప్పనిసరి అయింది. మీరు పబ్లిక్ సెక్టార్ లేదా ప్రైవేట్ LPG సర్వీస్‌ను వాడుతున్నా, ఆధార్ లింక్ చేయడం చాలా ముఖ్యం.
ఆన్లైన్ ద్వారా ఆధార్ లింక్ చేసే విధానం (స్టెప్ బై స్టెప్)
ఆధికారిక UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి..
“బెనిఫిట్ టైప్” విభాగంలో ‘LPG’ ఎంచుకోండి.
మీ గ్యాస్ సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపిక చేయండి. (ఉదాహరణకు, ఇండేన్ అయితే IOCL ఎంచుకోండి)
స్థానిక డీలర్‌ను సెలెక్ట్ చేసి, మీ LPG కస్టమర్ నంబర్ ఎంటర్ చేయండి.
మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, ఆధార్ నంబర్ వివరాలు ఇవ్వండి.
సమాచారం సమర్పించిన తర్వాత, OTP వెరిఫికేషన్ కోసం వేచి ఉండండి.
వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయండి.
అధికారికంగా వాలిడేషన్ అయిన తర్వాత, కంఫర్మేషన్ మెసేజ్‌కి వేచి ఉండండి.
ఆఫ్‌లైన్ విధానం
మీకు ఆన్లైన్ ప్రక్రియలో ఇబ్బందిగా అనిపిస్తే, మీరు మీ సమీప LPG డీలర్ కార్యాలయానికి వెళ్లి కూడా లింక్ చేయించుకోవచ్చు. అక్కడ మీరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, LPG కనెక్షన్ వివరాలు అందించాలి.
సబ్సిడీ ఫారం ఎలా సమర్పించాలి?
మీ డిస్ట్రిబ్యూటర్ వెబ్‌సైట్ నుంచి LPG సబ్సిడీ ఫారం డౌన్‌లోడ్ చేసుకోండి.
అవసరమైన అన్ని వివరాలు భర్తీ చేయండి.
ఫారంను మీ సమీప డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో సమర్పించండి.
కస్టమర్ కేర్ ద్వారా కూడా లింక్ చేయవచ్చు
మీ LPG డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ కేర్ లేదా కాల్ సెంటర్‌కి కాల్ చేయండి.
అక్కడి ఆపరేటర్ సూచనల ప్రకారం ఆధార్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.వెరిఫికేషన్ పూర్తయ్యే వ్యవధి
సాధారణంగా ఆధార్ లింకింగ్ వెరిఫికేషన్ చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. లింకింగ్ విజయవంతంగా అయిన తర్వాత, మీ రిజిస్టర్‌డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కు SMS/ఇమెయిల్ రూపంలో నిర్ధారణ సందేశం అందుతుంది.
































