పీఎం కిసాన్ లబ్ధిదారులు ఫోన్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలంటే ఎలా? చాలా సింపుల్ ఇలా చేయండి..

www.mannamweb.com


రైతు దేశానికి వెన్నెముక అని అంటారు. రైతు సంతోషంగా ఉంటే ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తుంటాయి.

అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఏటా రైతుల ఖాతాల్లో కొంత మొత్తాన్ని జమ చేస్తూ ఉంటారు. ఇది రైతులకు పెట్టుబడి కింద ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద రైతులకు ఏడాది రూ. 6వేలను సాయంగా అందిస్తారు. ఇది కూడా ఒకేసారి ఇవ్వరు. మూడు విడతలుగా రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తారు. ఏప్రిల్‌-జూలై, ఆగస్టు-నవంబర్‌, డిసెంబర్‌-మార్చి సమయాల్లో జమ చేస్తారు. ప్రతి విడతలో రూ. 2వేల చొప్పున సాయం అందిస్తారు.

18వ విడత కోసం ఎదురు చూపులు..

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత సాయాన్ని గత జూన్ 18న విడుదల చేశారు. ఇప్పుడు అందరి చూపు 18వ విడత ఎప్పుడు వస్తుందన్న దానిపైనే ఉంది. ఇది సెప్టెంబర్ చివర్లో గానీ, అక్టోబర్లో గానీ అంటున్నారు. అ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా ఏమి రాలేదు. అయితే ఈలోపు లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోవడం ముఖ్యం. అలాగే తమ ఫోన్‌ నంబర్‌ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఫోన్‌ నంబర్‌ మారినా.. పథకానికి ఇచ్చిన నంబర్‌ పనిచేయకపోయినా వెంటనే అప్‌ డేట్‌ చేసుకోవాలి. లేకపోతే పథకానికి సంబంధించిన ప్రయోజనాలు మీరు పొందలేకపోవచ్చు. నంబర్‌ అప్‌ డేట్‌ కోసం పీఎం కిసాన్‌ పోర్టల్‌ను సందర్శించాలి. అయితే దీని కోసం ఎవరో అధికారి లేదా సిబ్బంది వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ద్వారా చేసేసుకోవచ్చు. అదెలాగో స్టెప్‌ బై స్టెప్‌ విధానాన్ని మీకు అందిస్తున్నాం. ఇప్పుడే తెలుసుకోండి..

పీఎం కిసాన్‌ పోర్టల్లో ఫోన్‌ నంబర్‌ అప్‌డేట్‌..

పీఎం కిసాన్ పోర్టల్ ను సందర్శించండి.
హెూమ్ పేజీలో, మీరు ఫార్మర్ కార్నర్‌ లోకి వెళ్లి ‘అప్డేట్ మొబైల్ నంబర్’ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసి క్లిక్‌ చేయాలి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆపై క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్‌ బటన్ పై క్లిక్ చేయండి.
కింద కనిపించే బాక్స్‌లో టిక్‌ చేసి గెట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
మీ ఆధార్-లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వసతుంది. దానిని ఎంటర్‌ చేసి ధ్రువీకరించండి.
రిజిస్ట్రేషన్ నంబర్, మీ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, జెండర్‌ వివరాలతో కూడిన పూర్తి సమాచారం మీకు అందుతుంది.
ఇప్పుడు, దిగువన ఉన్న బాక్స్‌లో కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి.
మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి ధ్రువీకరించండి. అంతే మీ కొత్త నంబర్‌ అప్‌డేటఅయిపోతుంది.