ATM నుండి PF డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? ఫారమ్‌లు లేవు, ఆమోద ఒత్తిడి లేదు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ప్లాట్‌ఫామ్‌ను ఆధునీకరించడానికి సిద్ధమవుతోంది. EPFO 3.0 పేరుతో ఒక కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.


ఇది జూన్ 2025 నుంచి యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా PF సభ్యులు తమ ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను చాలా సులభతరం చేయడమే కాకుండా, వేగవంతం కూడా చేయనున్నారు.

ఇక చిటికలో పీఎఫ్ విత్‌డ్రా

EPFO 3.0 అందుబాటులోకి వస్తే ఉద్యోగులు ఇకపై UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) ల సహాయంతో కూడా తమ PF డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న ఫారమ్‌లు నింపడం, ఆమోదం కోసం ఎదురుచూడడం వంటి సుదీర్ఘ ప్రక్రియలు ఇకపై ఉండవు. నివేదికల ప్రకారం.. చాలా వరకు క్లెయిమ్‌లు ఇప్పుడు ఆటోమెటిక్‌గా ప్రాసెస్ అవుతాయి. కేవలం 3 రోజుల్లోనే డబ్బులు అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది.

EPFO 3.0 లో భారీ మార్పులు

కొత్త EPFO 3.0 ప్లాట్‌ఫామ్‌లో కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయి

1. ATM, UPI ద్వారా విత్‌డ్రాయల్: PF ఖాతా నుండి డబ్బులు తీయడానికి ఇప్పుడు ATM కార్డుల వంటి విత్‌డ్రాయల్ కార్డులు జారీ అవుతాయి.

2. ఆన్‌లైన్ బ్యాలెన్స్ చెక్ & ఫండ్ ట్రాన్స్‌ఫర్: సభ్యులు తమ PF బ్యాలెన్స్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. అలాగే, తమకు నచ్చిన బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

3. డిజిటల్ KYC అప్‌డేట్: మొబైల్ OTP వెరిఫికేషన్ ద్వారా PF అకౌంట్‌ను అప్‌డేట్ చేసుకోవడం సులభం అవుతుంది.

4. సేఫ్టీకి ప్రత్యేక ప్రాధాన్యత: అన్ని లావాదేవీలు, అప్‌డేట్‌ల కోసం పటిష్టమైన భద్రతా చర్యలను చేర్చారు.

ATM నుండి PF డబ్బులు ఎలా తీయాలి?

ATM ద్వారా PF డబ్బులు తీయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి

* మీ PF అకౌంట్‌కు లింక్ చేయబడిన EPFO విత్‌డ్రాయల్ కార్డు తీసుకోవాలి.

* ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేయండి (దాదాపు 90% క్లెయిమ్‌లు ఇప్పుడు ఆటోమేటెడ్‌గా జరుగుతాయి).

* క్లెయిమ్ సెటిల్‌మెంట్ అయిన తర్వాత, ATM ద్వారా విత్‌డ్రాయల్ కార్డును ఉపయోగించి డబ్బులు తీసుకోవచ్చు.

* మీరు ఎంచుకున్న కారణాన్ని బట్టి విత్‌డ్రాయల్ పరిమితి ఉంటుంది. ఇది మొత్తం బ్యాలెన్స్‌లో 50% నుండి 90% వరకు ఉండొచ్చు.

PF డబ్బులు తీయడానికి కావాల్సినవి

PF డబ్బులు విత్‌డ్రా చేయడానికి కొన్ని ముఖ్యమైన వివరాలు తప్పనిసరి

* UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) యాక్టివ్‌గా ఉండాలి.

* మీ మొబైల్ నంబర్, ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్-అన్నీ UANతో లింక్ అయి ఉండాలి.

* గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, క్యాన్సిల్డ్ చెక్ (IFSC, అకౌంట్ నంబర్ ఉన్నది), UPI/ATM ఇంటిగ్రేషన్ తప్పనిసరి.

ఈ మార్పులతో PF డబ్బులు తీయడం ఉద్యోగులకు మరింత సులభంగా, వేగంగా మారనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.